ఛాయాచిత్రం (ఆంగ్లం:photograph లేదా photo) అనునది ఒక కాంతిని గుర్తించు ఉపరితలం (సాధారణంగా ఈ పదార్థం ఒక ఫోటోగ్రఫిక్ ఫిలిం గానీ లేదా CCD/CMOS చిప్) పై కాంతి ప్రసరించినపుడు ఏర్పడే ఒక చిత్రం. చాలా ఛాయాచిత్రాలు కటకం ఉపయోగించే కెమెరా సహాయంతో చిత్రీకరించబడే దృశ్యంలో కంటికి కనబడే తరంగ దైర్ఘ్యాల పై దృష్టి సారించి వాటినే పునరుత్పత్తి చేయటంతో రూపొందించబడతాయి. ఛాయాచిత్రాలని రూపొందించే ప్రక్రియనీ నైపుణ్యతనీ ఛాయాచిత్రకళ అంటారు. గ్రీకు భాషలో ఫోటో అనగా కాంతి, గ్రాఫీ అనగా లిఖించటం లేదా చిత్రీకరించటం.

ప్రపంచంలోకెల్లా ఇప్పటివరకూ తెలిసినవాటిలో అతి పురాతనమైన ఛాయాచిత్రం. నిసెఫోర్ నీప్సె అనే రసాయన శాస్త్రవేత్త ఈ ఛాయాచిత్రాన్ని 1825 లో హీలియోగ్రఫీ ప్రక్రియ ద్వారా ఒక మనిషి గుర్రాన్ని నడిపించుకొంటూ వెళుతున్నపుడు తీశాడు.