ఛార్లెస్‌ బాబేజ్‌

గణితశాస్త్రవేత్త, తత్త్వవేత్త, మెకానికల్ ఇంజనీరు, మరియు నమూనా ప్రోగ్రామబుల్ కంప్యూటర్ ను తయారు చేసిన ఒక కంప్యూటర్ శాస్త్రవేత్త[1]. ఈయనను కంప్యూటర్ పిత అంటారు

ఛార్లెస్ బబాజ్ (26 డిసెంబరు 1791 - 18 అక్టోబరు 1871) ఒక ఇంగ్లీషు గణితశాస్త్రవేత్త, తత్త్వవేత్త, మెకానికల్ ఇంజనీరు,, నమూనా ప్రోగ్రామబుల్ కంప్యూటర్ ను తయారు చేసిన ఒక కంప్యూటర్ శాస్త్రవేత్త[1]. ఈయనను కంప్యూటర్ పిత అంటారు[2].

ఛార్లెస్‌ బాబేజ్‌
1860 లో ఛార్లెస్‌ బాబేజ్‌
జననం(1791-12-26)26 డిసెంబరు 1791
లండన్, ఇంగ్లాండ్
మరణం18 అక్టోబరు 1871(1871-10-18) (వయస్సు 79)
Marylebone, London, England
జాతీయతఇంగ్లీషు
రంగములుగణితము, ఇంజనీరింగ్, పొలిటికల్ ఎకానమీ, కంప్యూటర్ సైన్సు
విద్యాసంస్థలుట్రినిటీ కాలేజ్, కేంబ్రిడ్జ్
చదువుకున్న సంస్థలుపీటర్ హౌస్, కేంబ్రిడ్జ్
ప్రసిద్ధిగణితము, కంప్యూటింగ్
ప్రభావితం చేసినవారురాబర్ట్ ఉడ్‌హౌస్, గాస్పార్డ్ మోంగే, జాన్ హెర్షే
ప్రభావితులుకార్ల్ మార్క్స్, en:John Stuart Millజాన్ స్టువర్ట్ మిల్
సంతకం
చార్లెస్ బబేజ్

వ్యక్తిగత జీవితముసవరించు

తన పై చదువులకు 1810 లోట్రినిటీ కాలేజీ, కేంబ్రిడ్జికి వెళ్ళాడు. అక్కడ లీబ్నిట్జ్, లగ్రాంజ్, సింప్సన్, లాక్రియాక్స్ లను చదివిన బబాజ్, అక్కడి గణిత శాస్త్ర బోధనతో నిరుత్సాహపడి, జాన్ హెర్షల్, జార్జి పీకాక్ ఇంకా కోందరితో కలిసి 1812లోవిశ్లేషక సమాజమును స్థాపించాడు.కంప్యూటర్ నిర్మాణానికి ఆద్యుడు చార్లెస్ బాబేజ్. 1791 డిసెంబర్ 26 న బెంజిమన్, బెట్సీ దంపతులకు లండన్‌లో జన్మించారు. ప్రాథమిక,ఉన్నత విద్యాభ్యాసాలు ఇంటివద్ద, ప్రైవేట్ పాఠశాలలో జరిగాయి. పై చదువులను కేంబ్రిడ్జ్‌లోని ట్రినిటీ కాలేజ్, పీటర్‌హౌస్‌లో పూర్తిచేసి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి గౌరవపట్టా పొందారు. కేంబ్రిడ్జ్‌లో గణితాచార్యుడిగా కొంతకాలం పనిచేసి మంచి గణిత శాస్త్రజ్ఞుడిగా పేరు తెచ్చుకొన్నారు .

కంప్యూటర్ డిజైన్సవరించు

గణిత శాస్త్ర పట్టికలలో అధిక దోషాలను నివారించడానికి, బాబాజ్ యాంత్రికముగా పట్టికలను తయారుచేసే విధానము కనుక్కోగడానికి ప్రయత్నంచాడు. బాబాజ్ ఇంజన్ మొదటి మెకానికల్ కంప్యూటర్. కాని అది నిధులు లేక అప్పటిలో నిర్మించబడలేదు. 1991లో ఛార్లెస్ అసలు ప్లాన్ తో ఒక డిఫరెన్స్ ఇంజన్ [తెలుగు పదము కావాలి]ను నిర్మిస్తే అది చక్కగా పనిచేసింది.

సొంతంగా గణనలు చేసే యంత్రానికి బాబేజ్ రూపకల్పన చేశారు. 'డిఫరెన్స్ ఇంజిన్', 'డిఫరెన్స్ ఇంజిన్ - II', సాంకేతికంగా ఎంతో ఉన్నతమైన 'ఎనలటికల్ ఇంజిన్ అనే యంత్రాలను తయారు చేశారు. వీటికి సంబంధించిన పత్రాలను చదివిన శాస్త్రవేత్తలు బాబేజ్ కృషిని ప్రశంసించారు. ఈ యంత్రాలు ప్రస్తుత కంప్యూటర్‌లా ఆలోచించి, సమస్యల సాధనను మానవ సాయం లేకుండా కనుక్కొనే విధంగా ఉన్నాయని భావించారు. బాబేజ్‌ను కంప్యూటర్ నిర్మాణానికి ఆద్యుడు అని పిలిచారు. రైల్వే సంస్థల కోసం 'పైలట్', 'డైనమో మోటార్ కారు', కంటి పరీక్షల కోసం 'ఆఫ్తాలమోస్కోప్' అనే పరికరాలను కూడా చార్లెస్ బాబేజ్ తయారు చేశారు. గణిత, ఖగోళ సంబంధ పట్టికలను గణన చేసే యంత్రాన్ని తయారుచేశాడు. ఈ పరిశోధనకు 1824లో రాయల్ ఆస్ట్రనామికల్ సొసైటీ నుంచి బంగారు పతకాన్ని పొందారు. బాబేజ్ జ్ఞాపకార్థం చంద్రునిపై ఉన్న ఒక బిలానికి బాబేజ్ బిలం అని పేరు పెట్టడమే కాకుండా ఆయన పేరుమీద చార్లెస్ బాబేజ్ ఇన్‌స్టిట్యూట్ అనే సంస్థను కూడా స్థాపించారు. 1871లో 79వ ఏట మరణించారు.

మూలములుసవరించు

  1. Terence Whalen (1999). Edgar Allan Poe and the masses: the political economy of literature in antebellum America. Princeton University Press. p. 254. ISBN 978-0-691-00199-9. Retrieved 18 April 2013. CS1 maint: discouraged parameter (link)
  2. Halacy, Daniel Stephen (1970). Charles Babbage, Father of the Computer. Crowell-Collier Press. ISBN 0-02-741370-5.

ఇతర లింకులుసవరించు

వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.