మూస:Infobox Food అంధ్రదేశంలో విరివిగా వాడే ఒకరకమైన పిండి వంట జంతికలు. కేవలం పండుగలకు మాత్రమే కాక మామూలు సమయాలలోనూ వండుకొనే ప్రసిద్ధ వంటకం జంతిక. తెలంగాణా ప్రాంతంలో వీటినే మురుకులు అని వ్యవహరిస్తారు. ఇవి దేశవ్యాప్తంగానూ, భారతీయులు అధికంగా కల దేశాలలోనూ విరివిగా లభ్యమగును.

కరకరలాడే జంతికలు

తయారుచేయు విధానం

మార్చు

వరి పిండిని ముద్దగా చేసి దానికి తగిన ఉప్పు కావలసిన దినుసులు చేర్చి గుండ్రంగా తిరుగుతూ పిండిని సన్న దారాలుగా మార్చే ఒక సాధనానికి గల ఖాళీలో ఆ ముద్దను వేసి నొక్కుతూ కావలసిన ఆకారాలలో మరిగే నూనెలో వదులుతూ జంతికలను తయారు చేస్తారు. పిల్లలు అధికంగా కల ఇళ్ళలోనూ, వర్షాకాలంలోనూ ఎక్కువగా తయారు చేస్తుంటారు. కరకరలాడుతూ, కారంకారంగా, ఉప్పుప్పగా, ఎక్కువకాలం నిలువ ఉండటం వలన ఈ వంటకం ప్రతి ఇంట్లోనూ తప్పని సరిగా కనిపిస్తుంది

చిత్రమాలిక

మార్చు

వెలుపలి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=జంతిక&oldid=4310518" నుండి వెలికితీశారు