జంతుశాస్త్రం

జీవ శాస్త్రంలోని ఒక ముఖ్యమైన విభాగం జంతు శాస్త్రం. ఇది జంతువులకు సంబంధించి వాటి పెరుగుదల నిర్మాణం, అండోత్పత్తి, పరిణామం, వర్గీకరణ, అలవాట్లు, జంతువుల పంపిణీ, జీవించియున్న, అంతరించిపోయిన జంతువుల గురించి సమగ్రంగా తెలియజేయచేస్తుంది. జంతుశాస్త్రాన్ని ఇంగ్లీషులో జువాలజీ అంటారు. జువాలజీ అనే పదం పురాతన గ్రీకు పదం నుండి ఉద్భవించింది. గ్రీకు భాషలో జువాలజీ అనగా జంతు జ్ఞానం అని అర్ధం.