జంధ్యాల మహతీశంకర్

Dr.జంధ్యాల మహతీశంకర్(1940-2023) తెలుగు కవి, రచయిత[1]. అతను కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి వద్ద సాహిత్య విద్యనభ్యసించాడు. విజయవాడ శాతవాహన కళాశాలలో ఆంధ్ర శాఖాధ్యక్షులుగా, రీడరుగా పనిచేసాడు. 1984లో ఉత్తమ కళాశాలాధ్యపకునిగా రాష్ట్రప్రభుత్వ పురస్కారాన్ని అందుకున్నాడు. ఆయన "వేలూరి శివరామశాస్త్రి కృతులు-సమీక్ష" అనే పరిశోధనా గ్రంధం రాసి, ఆంధ్రా విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి అందుకున్నారు. ఆయన తెలుగు సాహిత్యంలో అనేక గ్రంథాలను రచించారు.

[2]

రచనలు మార్చు

  1. సాహితీమహతి
  2. వేలూరి శివరామశాస్త్రి వ్యాసభారతి
  3. వేలూరి శివరామశాస్త్రి అవధాన భారతి
  4. వేలూరి సారస్వత వ్యాసావళి
  5. అష్టదిగ్గజ కవితావైభవం
  6. కరుణశ్రీ కవితా విజయశ్రీ
  7. ఎఱ్ఱన కృతులు సమాజ చిత్రణము
  8. వేలూరి శివరామశాస్త్రి (మోనోగ్రాఫ్)
  9. వ్యాసవాణి[3]
  10. కవిత్రయ భారతంలో కమనీయ ఘట్టాలు
  11. తెలుగులో రాజకవులు
  12. తెలుగుకవులు - భక్తితత్త్వం

మూలాలు మార్చు

  1. "Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi". www.andhrabhoomi.net. Retrieved 2020-07-15.
  2. "Google Groups". groups.google.com. Retrieved 2020-07-15.
  3. "వ్యాసవాణి : వేలూరి శివరామశాస్త్రి, జంధ్యాల మహతీశంకర్(సం.) : Free Download, Borrow, and Streaming". Internet Archive (in ఇంగ్లీష్). Retrieved 2020-07-15.

బాహ్య లంకెలు మార్చు