జగత్ కిలాడీలు ఫల్గుణా పిక్చర్స్ బ్యానర్‌పై ఐ.యన్. మూర్తి దర్శకత్వంలో 1969, జూలై 25న విడుదలైన తెలుగు సినిమా.

జగత్ కిలాడీలు
(1969 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం ఐ.యన్. మూర్తి
తారాగణం యస్వీ రంగారావు,
వాణిశ్రీ
సంగీతం ఎస్.పీ. కోదండపాణి
నిర్మాణ సంస్థ ఫల్గుణ ప్రొడక్షన్స్
భాష తెలుగు

సాంకేతిక వర్గం సవరించు

 • కథ, మాటలు : విశ్వప్రసాద్
 • సంగీతం: ఎస్‌పి కోదండపాణి
 • నృత్యం: ఐసి తంగరాజ్, రాజ్‌కుమార్
 • కళ: బిఎన్ కృష్ణ
 • ఎడిటింగ్: ఎన్‌ఎస్ ప్రకాశం
 • స్టంట్స్: మాధవన్
 • ఛాయాగ్రహణం: కన్నప్ప
 • స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఐ.యన్. మూర్తి
 • నిర్మాతలు: పి ఏకామ్రేశ్వర రావు, కె రాఘవ

నటీనటులు సవరించు

 • కాశీనాథ్ తాతా
 • జి.వరలక్ష్మి
 • కృష్ణ
 • రావు గోపాలరావు
 • గుమ్మడి
 • వాణిశ్రీ
 • ఎస్.వి.రంగారావు
 • రాజ్‌బాబు
 • బాలకృష్ణ
 • అర్జా జనార్ధనరావు
 • డాక్టర్ శివరామకృష్ణయ్య

చిత్రకథ సవరించు

జమీందారు రాజారావు (కాశీనాథ తాత). ఆయన భార్య శ్యామలాదేవి (జి వరలక్ష్మి). వారి కుమారుడు ఆనంద్ (కృష్ణ). అతను విదేశాల్లో ఉంటాడు. వీరి వంశానికి చెందిన ఓ నిధి రహస్యం జమీందారు దంపతులు, కొడుకు ఆనంద్‌కు మాత్రమే తెలుసు. ఆ పట్టణంలో దోపిడీదొంగ, క్రూరుడు అయిన భయంకర్ (రావుగోపాలరావు) నిధిని చేజిక్కించుకునే ప్రయత్నంలో జమీందారును అంతంచేసి, అతని భార్యను గుహలో బంధిస్తాడు. భయంకర్ ఆచూకీ కోసం పోలీసు కమిషనర్ సిన్హా (గుమ్మడి) ప్రయత్నిస్తుంటాడు. తండ్రి మరణంతో విదేశాల నుంచి వచ్చిన ఆనంద్, తల్లి ఆచూకీ కోసం భయంకర్‌ను ఎదుర్కొనే ప్రయత్నాలు చేస్తాడు. పోలీస్ కమిషనర్ ఇంట్లో ఆశ్రయం పొందిన ఆనంద్ బాగోగులను సిన్హా తల్లి భారతీదేవి (మాలతీ), చెల్లెలు శాంతి (వాణిశ్రీ) చూస్తుంటారు. అలా శాంతి -ఆనంద్‌ల మధ్య ప్రేమ చిగురిస్తుంది. అదే పట్టణంలో ఉండే రౌడీ గంగులు (ఎస్వీ రంగారావు) భయంకర్ దోపిడీ ప్రయత్నాలను అడ్డుకుంటుంటాడు. ఈ క్రమంలో కథ అనేక మలుపులు తిరుగుతుంది. చివరకు సిన్హాను హత్యచేసిన భయంకర్, అతని స్థానంలో సిన్హాగా చలామణి అవుతున్నాడని తెలుస్తుంది. ఇక రౌడీగంగులు ఎవరో కాదు, సెంట్రల్ సిఐడి గంగారామ్ అన్న రహస్యం బయటపడుతుంది. భయంకర్, అతని ముఠాను పోలీసులు అరెస్ట్ చేయటం, ఆనంద్, సిఐడి గంగారామ్‌కు అభినందనలు, శాంతి- ఆనంద్‌ల వివాహంతో చిత్రం శుభంగా ముగుస్తుంది[1].

పాటలు సవరించు

 1. ఎగిరే పావురమా దిగులెరుగని పావురమా - పి.సుశీల - రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
 2. ఎక్కడన్నా బావా అంటే ఒప్పు - ఎస్.పి. బాలు, విజ్యలక్ష్మి కన్నారావు - రచన: కొసరాజు
 3. కిలాడీలు లోకమంతా కిలాడీలురా ఒకరికన్నా ఒకరు - పి.సుశీల - రచన: కొసరాజు
 4. వేళచూస్తే సందెవేళ గాలి వీస్తే పైరగాలి ఏల- పి.సుశీల, ఎస్.పి. బాలు - రచన: దేవులపల్లి

మూలాలు సవరించు

 1. సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి. "ఫ్లాష్‌బ్యాక్ @50 జగత్ కిలాడీలు". 20 July 2019. Archived from the original on 3 ఆగస్టు 2019. Retrieved 13 September 2019.

బయటి లింకులు సవరించు