జఘన కేశాలు లేదా ఆతులు మానవ జననేంద్రియాలపై మొలిచే జుట్టు. ఈ జుట్టు మానవులలో శైశవ దశలో ఉండనప్పటికీ బాల్యములో దీని పెరుగుదలకు బీజం పడుతుంది. యుక్త వయస్సు వచ్చే నాటికి స్త్రీ పురుషులలో ఈ జుట్టు పూర్తి స్థాయిలలో పెరగడం ఆరంభమౌతుంది. వ్యక్తిగత పరిశుభ్రతలో భాగంగా దీనిని శుభ్రం చేసుకోవడం ప్రతి మానవుని బాధ్యత. లేనిచో జననేంద్రియాల వద్ద దురద, నవ లేదా ఇతర చర్మ సంబంధిత వ్యాధులు ప్రబలుతాయి.

Male genital organ with public hair(left) and Female genital organ with publicbhair(right).

శుభ్రపరిచే విధానాలు మార్చు

ఈ జుట్టును పూర్తిగా తొలగించినూ వచ్చు లేదా కత్తిరించవచ్చు. ఏం చేసినా దీని పెరుగుదల మాత్రం ఆగదు. కావున క్రమం తప్పకుండా దీనిని తొలగించుకోవడం మంచిది. ఈ క్రింది ప్రక్రియలను ఇందుకు ఎన్నుకోవచ్చు.

షేవింగ్ / క్షవరం మార్చు

ఎక్కువ మంది స్త్రీ పురుషులు దీనిని అవలంబిస్తారు. ఈ పద్ధతిలో ఒక రేజర్ తీసుకుని జననేంద్రియాల వద్ద నున్న జఘన జుట్టును జాగ్రత్తగా తొలగించవలసి ఉంటుంది. ఇక్కడ ఏ మాత్రం అజాగ్రత్త వహించినా చిన్న చిన్న గాయాలు మొదలుకొని తీవ్ర రక్త గాయాలు అయ్యే అవకాశం ఉంది. అలాగే రేజర్, బ్లేడు పరిశుభ్రంగా ఉండాలి. ఈ రెండిటినీ పని అయిన తర్వాత యాంటీ సెప్టిక్ ద్రావణము లేదా డెట్టాల్ తో బాగా కడిగి ఆపై ఎండలో ఆరబెట్టి తర్వాత భద్రపరచాలి.

ట్రిమ్మింగ్ / కత్తిరింపు మార్చు

క్షవరంతో పోల్చినపుడు ఇది సురక్షిత విధానము. ఈ విధానములో ట్రిమ్మర్ లేదా చిన్న కత్తెరను ఒడుపుగా తిప్పుతూ ఆతులను శుభ్రం చేసుకోవచ్చును. ఇందులో చర్మానికి కత్తెర తగలదు కాబట్టి రిస్క్ శాతం తక్కువ. పురుషులలో జననేంద్రియాలు బాహ్యంగా ఉంటాయి కాబట్టి దీనిని వాడునపుడు జాగరూకత అవసరము. లేనిచో సున్నితమైన చర్మభాగము తెగే అవకాశం ఉంది.

 
ఒక పరిణతి పురుషుడు (ఎడమ) న జఘన జుట్టు, ఒక పరిణతి పురుషుడు (కుడి) యొక్క వైవిధ్యం.

కత్తిరింపు శైలి మార్చు

వెర్రి వేయి విధాలు అన్నట్లు కొంతమంది వారి శైలి లేదా జీవనశైలి అనుసరించి ఆతులను ప్రత్యేకంగా కత్తిరించుకుంటారు. అలాంటి కొన్ని కత్తిరింపు శైలులను క్రింద చూడవచ్చు.