Inverted French Braid
రెండు జడలు వేసుకున్న ఒక స్త్రీ

జడ, జెడ లేదా జట (Braid or Plait) తల వెంట్రుకలను ఒక పద్ధతిలో అమర్చుకొనే పద్ధతి. కొంతమంది స్త్రీలు ఒకటే జడ వేసుకుంటే ముఖ్యంగా పిల్లలు రెండు జడలు వేసుకుంటారు. యోగుల శిరోజాలు జడలు కట్టి ఉంటుంది. అందువలన వీరిని జడధారి అంటారు.

జడ వేసే పద్ధతి

భాషా విశేషాలుసవరించు

తెలుగు భాషలో జట, జడ పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.[1]

ఆభరణాలుసవరించు

జడకు ప్రత్యేకంగా చేసుకొనే అలంకరణలలో ముఖ్యమైనవి ఆభరణాలు. వీటిలో జడపాళీ (నాగరం), జడగంటలు, చామంతిపువ్వు, పాపిటబిళ్ళ, చెంపసరాలు ముఖ్యమైనవి. వీటిలో జడ మొత్తం అంతా పైనుండి క్రిందవరకు అందంగా చేస్తుంది. వీనికి కెంపులు, పచ్చలు, వజ్రాలు పొదిగేవారు. తల వెనుకభాగంలో జడ పైభాగంలో చామంతిపువ్వు, తమలపాకులూ సూర్యచంద్రుల్లా అమరితే, పాపిటబిళ్ళ ముందు నుండి వెనుక వరకు పాపిటంతా కప్పుతుంది. ముందున, మధ్యలో కూడా చిన్న బిళ్ళలుంటాయి. జడ చివరలో 1-3 గంటల వంటి జడగంటలు తప్పనిసరిగా జోడీగా ఉండాల్సిందే మరి.

మూలాలుసవరించు

  1. "బ్రౌన్ నిఘంటువు ప్రకారం జడ పదప్రయోగాలు". మూలం నుండి 2016-01-25 న ఆర్కైవు చేసారు. Retrieved 2009-12-29. Cite web requires |website= (help)
"https://te.wikipedia.org/w/index.php?title=జడ&oldid=2880636" నుండి వెలికితీశారు