ఏ బాహ్య బలం పనిచేయకపోతే నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు అదే స్థితిలోనూ సమవేగంతో ఋజు మార్గంలో గమించే వస్తువు అదే గమన స్థితిలోనూ ఉండిపోయే వస్తువు ధర్మాన్ని జడత్వం అంటారు.

జడత్వమును నిరూపించు ప్రయోగము

ఉదాహరణలు

మార్చు
  • కొన్ని కేరమ్స్ కోయిన్స్ తీసుకుని ఒకదానిపై నొకటి పేర్చి, స్ట్రైకర్ తో గట్టిగా అడుగున ఉన్న కాయిన్ ను గురి చూసి కొడితే అది మాత్రమే బయటకు వచ్చేస్తుంది. జడత్వం వల్ల మిగిలిన కాయిన్లు గల వరుస అదే విధంగా ఉండిపోతుంది.
  • ఒక వెడల్పు మూతిగల సీసా తీసుకుని దానిలో యిసుక పోయవలెను. (ధృఢంగా ఉండుటకు) దాని మూతిని కార్డు బోర్డు అట్టతో మూసివేయుము. దాని మూతికి సరిగ్గా పైన ఒక గాజు గోళీని ఉంచవలెను. ఈ కార్దుబోర్డును హఠాత్తుగా లాగినపుడు జడత్వం వల్ల గాజుసీసా మూతిగుండా సీసాలో పడిపోతుంది.

రకములు

మార్చు
  • నిశ్చల జడత్వం
  • గమన జడత్వం
  • దిశా జడత్వం

నిర్దేశ చట్రాలు

మార్చు

జడత్వ నిర్దేశ చట్రం

మార్చు

ఊహాత్మక నిరూపాక్షాలను కలిగియుండి, నిశ్చలంగా గాని, సమ చలనంతో గాని ఉండి న్యూటన్ గమన నియమాలను వినియోగించడానికి వీలున్న వ్యవస్థలని జడత్వ నిర్దేశ చట్రం అంటారు

అజడత్వ నిర్దేశ చట్రం

మార్చు

భ్రమణంలో కాని త్వరణంలో కాని ఉన్నటువంటి వస్తువుకు జోడించబడిన, న్యూటన్ గమన నియమాలు పాటించని ఊహాత్మక నిరూపక వ్యవస్థనే అజడత్వ నిర్దేశ చట్రం అంటారు.

నిశ్చల జడత్వం

మార్చు

ఒక బస్సు నిశ్చల స్థితిలో గలదు. అందులో ప్రయాణీకులు కూడా నిశ్చల స్థితిలోనే ఉంటారు. ఇపుడు బస్సు ఒకేసారి ముందుకు కలిలితే అందులోని ప్రయాణీకులు వెనుకకు పడతారు. ఇది నిశ్చలస్థితికి సంబంధించిన జడత్వం.

గమన జడత్వం

మార్చు

ఒక బస్సు గమనంలో ఉందని అనుకుందాం. అందులోని ప్రయాణీకులు కూడా అదే వేగంతో గమన స్థితిలో ఉంటారు. ఇపుడు బస్సు హఠాత్తుగా ఆగితే ప్రయాణీకులు ముందుకు పడతారు. ఇది గమన జడత్వానికి ఉదాహరణ.

దిశా జడత్వం

మార్చు

ఒక బస్సులో ప్రయాణీకులు ప్రయాణిస్తున్నారు అనుకొనుము. అది హఠాత్తుగా వక్రమార్గంలో కుడి వైపుకి తిరిగినట్లైన ప్రయాణీకులు ఎడమవైపు పడతారు. ఇది దిశ జడత్వానికి ఉదాహరణ.

"https://te.wikipedia.org/w/index.php?title=జడత్వము&oldid=3161878" నుండి వెలికితీశారు