జననీ శివకామినీ నర్తనశాల (1963) సినిమా కోసం సముద్రాల రాఘవాచార్య రచించిన భక్తిగీతం. దీనిని పి.సుశీల గానం చేయగా సుసర్ల దక్షిణామూర్తి సంగీతాన్ని అందించారు.[1] నర్తనశాల సినిమాలో ద్రౌపది (సావిత్రి) ఆలపించే పాట ఇది.

జననీ శివకామినీ అనే ఈ పాట నర్తనశాల సినిమాలోది. (నర్తనశాల సినిమా ప్రచార గోడపత్రిక 1963)

సందర్భం

మార్చు

పాండవులు పదమూడేళ్ల అరణ్యవాసం జయప్రదంగా ముగించుకుని ఏడాదిపాటు ‘అజ్ఞాతవాసం’ చేయాల్సి వచ్చిన సందర్భంలో వచ్చే పాట ఇది. ఏడాదిపాటు అజ్ఞాతవాసం పూర్తి చేయడానికి అనువైన ప్రదేశంగా విరాటరాజు కొలువును ఎంపిక చేసుకున్న పాండవులు -ప్రచ్ఛన్న వేషదారులై అక్కడికి చేరతారు. పాండవులు ద్రౌపది సైరంద్రీగా మాలిని అనే మాయపేరుతో సుదేష్ణదేవి కొలువుకు చేరాలని నిర్ణయిస్తారు. ఆ క్రమంలో సుధేష్ణదేవి పూజ కోసం ఆలయానికి వచ్చినపుడు కాత్యాయని అమ్మను కొలుస్తూ ద్రౌపది పాడే పాట ఇది. ఒకపక్క సుధేష్టదేవిని మెప్పించడానికి, మరోపక్క ‘అజ్ఞాతవాసం’ నిర్విఘ్నంగా సాగడానికి తోడుండాలని కోరుతూ ద్రౌపది భక్తి వినయంతో పాడే పాటలో సావిత్రి నటన అమోఘం. పాటను చిత్రీకరించిన విధానం, సంగీత సాహిత్యాలు, పాత్రధారుల నటన -అన్నీ సమపాళ్లలో రంగరించి అందించిన పాట ఇది. [2]

పాట సాహిత్యం

మార్చు

పల్లవి :
జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి

చరణం 1 :
అమ్మవు నీవే అఖిల జగాలకు
అమ్మల గన్నా అమ్మవు నీవే
నీ చరణములే నమ్మితినమ్మ
శరణము కోరితినమ్మా భవాని

చరణం 2 :
నీదరినున్న తొలగు భయాలు
నీ దయలున్న కలుగు జయాలు
నిరతము మాకు నీడగ నిలచీ
జయమునీయవే అమ్మ భవాని

మూలాలు

మార్చు
  1. "Janani Sivakamini (From "Narthanasala") (Testo) - P. Susheela". MTV Testi e Canzoni (in ఇటాలియన్). Archived from the original on 2021-06-02. Retrieved 2021-06-02.
  2. "నాకు నచ్చిన పాట--జననీ శివకామినీ.. | Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi". www.andhrabhoomi.net. Retrieved 2021-06-02.