జయపుర వరదలు - 2019
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
2019 మార్చి 16న హఠాత్తుగా సంభవించిన వరదల్లో ఇండొనేషియాకు చెందిన పాపువా ప్రావిన్సులోని జయపుర రీజెన్సీ చిక్కుకుంది. హఠాత్తుగా సంభవించిన భారీ వర్షాల వల్ల వరదలే కాక కొన్ని గంటల తర్వాత జయపుర నగరంలో కొండచరియలు కూడా విరిగిపడ్డాయి. కనీసం 113 మంది ఈ రెండు ఘటనల్లోనూ మరణించారు.
తేదీ | 2019 మార్చి 16–17 |
---|---|
ప్రదేశం | జయపుర, జయపుర రీజెన్సీ, పాపువా ప్రావిన్స్, ఇండోనేషియా. |
మరణాలు | 113[1] |
గాయపడినవారు | 159 |
గల్లంతైనవారు | 94[2] |
ఘటనలు
మార్చుకుండపోత వర్షాల కారణంగా జయపురా రీజెన్సీ, సెంటాని జిల్లాను వరదలు ముంచెత్తాయి. [3] 16 మార్చి రాత్రి 9:30 ఈ ఘటన సంభవించింది. సైక్లోప్స్ పర్వతాల నుండి వచ్చిన ఆకస్మిక ప్రవాహం వలన ఇది జరిగింది. BNPB ప్రతినిధి సుతోపో పూర్వో నుగ్రోహో చెప్పిన దాని ప్రకారం, ఒక కొండ చరియ జారి నదీ ప్రవాహాన్ని అడ్డగించి ఆనకట్ట లాగా ఏర్పడింది. కొంత సేపటి తరువాత నీటి వత్తిడికి అది ఒక్కసారిగా కొట్టుకు పోయి వరదకు దారితీసింది. [4] వరదనీటితో పాటు చెట్లు, బండరాళ్లతో సహా అనేక వస్తువులు కొట్టుకొచ్చాయి. [5] స్థానిక కెమిరి నది నీటి మట్టం పెరిగి, నదికి సమీపంలో ఉన్న భవనాలు మునిగిపోయాయి. [6] సైక్లోప్స్ పర్వతాలలో పర్యావరణ నష్టం కారణంగా వరదలు సంభవించాయని జయపురా రీజెంట్ మాథియాస్ అవోయిటౌ పేర్కొన్నాడు. [7]
మరో సంఘటనలో, మార్చి 17 న సుమారు 00:15 స్థానిక సమయానికి, జయపుర నగరంలో కొండచరియలు విరిగిపడ్డాయి. [8] ఈ రెండవ సంఘటనకు కూడా కుండపోత వర్షమే కారణం. [9]
బాధితులు
మార్చుమార్చి 17 మధ్యాహ్నం నాటికి, పాపువా ప్రాంతీయ పోలీసులు 70 మరణాలను నిర్ధారించారు, వాటిలో 63 జయపురా రీజెన్సీలో ఉండగా, 7 జయపురా నగరంలో ఉన్నాయి. మొత్తం 105 మంది గాయపడినట్లు నిర్ధారించారు, 75 మందిని "తేలికగా గాయపడినవారు", 30 మంది "తీవ్రంగా గాయపడినవారు"గా వర్గీకరించారు. [10] తరువాత, మరణాల సంఖ్య 73 కి పెరిగింది, వారిలో 66 మంది రీజెన్సీలో ఉన్నారు, 60 మంది తప్పిపోయినట్లు చెప్పారు. [11] ఎక్కువగా ప్రభావితమైన ప్రాంతం సెంటాని. ఇక్కడ కనీసం 51 మంది మరణించినట్లు సమాచారం. [12] బాధితుల మృతదేహాలను చాలావరకు బంధువుల గుర్తింపు, సేకరణ కోసం జయపురలోని భయంగ్‌కర ఆసుపత్రికి తీసుకువచ్చారు. [13]
మార్చి 26 నాటికి మరణాల సంఖ్య 113 కు పెరిగింది. [14]
మూలాలు
మార్చు- ↑ Grim search for survivors continues after floods kill 113 people in Indonesia
- ↑ Grim search for survivors continues after floods kill 113 people in Indonesia
- ↑ "At least 50 people killed by flash floods in eastern Indonesia". The Guardian. 17 March 2019. Retrieved 17 March 2019.
- ↑ Ikhbal, Andi Mohammad (17 March 2019). "Ini Penyebab Banjir Bandang di Sentani Jayapura". iNews.ID (in ఇండోనేషియన్). Archived from the original on 21 మార్చి 2019. Retrieved 17 March 2019.
- ↑ "Jalan raya Sentani-Kemiri putus akibat diterjang banjir". Antara News (in ఇండోనేషియన్). 16 March 2019. Retrieved 17 March 2019.
- ↑ "Banjir Jayapura Putuskan jalan Raya Sentani-Kemiri". Bisnis.com (in ఇండోనేషియన్). 17 March 2019. Retrieved 17 March 2019.
- ↑ "Banjir Bandang di Sentani Diduga Akibat Kerusakan Lingkungan". MetroTV News (in ఇండోనేషియన్). 17 March 2019. Archived from the original on 20 March 2019. Retrieved 17 March 2019.
- ↑ "Longsor di Ampera Jayapura, 4 Orang Meninggal Dunia". iNews.ID (in ఇండోనేషియన్). 17 March 2019. Archived from the original on 21 మార్చి 2019. Retrieved 17 March 2019.
- ↑ "Hujan Lebat Sebabkan Longsor di Kota Jayapura, 7 Orang Tewas Tertimbun". Kumparan (in ఇండోనేషియన్). 17 March 2019. Retrieved 17 March 2019.
- ↑ "Polisi: 70 Orang Meninggal Dunia Akibat Banjir Bandang di Sentani". detiknews (in ఇండోనేషియన్). 17 March 2019. Retrieved 17 March 2019.
- ↑ "Banjir Sentani, Papua: Korban meninggal setidaknya 73 orang, bayi lima bulan selamat". BBC (in ఇండోనేషియన్). 17 March 2019. Retrieved 17 March 2019.
- ↑ "Indonesia floods: Dozens dead in Papua province". BBC. 17 March 2019. Retrieved 18 March 2019.
- ↑ "Korban Meninggal Banjir Sentani Bertambah Jadi 46 Orang". Tempo (in ఇండోనేషియన్). 17 March 2019. Archived from the original on 11 డిసెంబరు 2019. Retrieved 17 March 2019.
- ↑ Grim search for survivors continues after floods kill 113 people in Indonesia