జయేశ్ రంజన్
జయేశ్ రంజన్, (ఆంగ్లం: Jayesh Ranjan) 1992 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ఐఏఎస్ బ్యాచ్‌లో ఆల్-ఇండియా టాపర్ గా నిలిచిన జయేశ్ రంజన్, ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ సమాచార-సాంకేతిక శాఖ, పరిశ్రమల శాఖల ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.[1]
జయేశ్ రంజన్ | |
---|---|
![]() జయేశ్ రంజన్ | |
జననం | జయేశ్ రంజన్ అక్టోబరు 25 |
వృత్తి | సమాచార-సాంకేతిక శాఖ, పరిశ్రమల శాఖ, టెక్స్‌టైల్-హ్యాండ్లూం శాఖల ముఖ్య కార్యదర్శి |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | ఐఏఎస్ అధికారి |
జననం, విద్యసవరించు
జయేశ్ రంజన్ అక్టోబరు 25న జన్మించాడు. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి సైకాలజీలో మాస్టర్స్ డిగ్రీ, కలకత్తాలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుండి బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ (లీ కువాన్ యూ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ) నుండి పబ్లిక్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందాడు.
బర్మింగ్‌హామ్ విశ్వవిద్యాలయం (పర్యావరణ విధాన విశ్లేషణపై), టోక్యోలోని జేఐసిఏ శిక్షణా సంస్థ (సరస్సుల నివారణపై), లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (గ్లోబలైజేషన్, లీడర్‌షిప్‌పై), హార్వర్డ్ యూనివర్సిటీలోని కెన్నెడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ (పబ్లిక్‌లో), స్టాక్‌హోమ్ స్వీడిష్ ఇన్‌స్టిట్యూట్ (సుస్థిరత, సిఎస్ఆర్ పై)లలో కోర్సులు చేశాడు.[2]
గుర్తింపులు - అవార్డులుసవరించు
- 2002లో ప్రపంచ బ్యాంకు యొక్క సోషల్ క్యాపిటల్ విజిటింగ్ స్కాలర్‌షిప్
- 2005లో బ్రిటిష్ ప్రభుత్వం గురుకుల్ చెవెనింగ్ స్కాలర్‌షిప్
- 2019లో రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్ (హైదరాబాదులో ఐకియా మొదటి భారతీయ స్టోర్‌ను ప్రారంభించడంతోపాటు భారతదేశంలో స్వీడిష్ వ్యాపార ప్రయోజనాలను ప్రోత్సహించినందుకు హిజ్ మెజెస్టి ది కింగ్ ఆఫ్ స్వీడన్‌చే)
ఇతర వివరాలుసవరించు
- 2020, ఫిబ్రవరి 10న తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా జయేశ్ రంజన్ ఎన్నికయ్యాడు. అసోసియేషన్ కు జరిగిన ఎన్నికల్లో ప్రత్యర్థి కె.రంగారావుపై జయేశ్ రంజన్ 13 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందాడు.[3]
మూలాలుసవరించు
- ↑ "IT Secretary | Information Technology, Electronics & Communications Department, Government of Telangana, India". it.telangana.gov.in. Archived from the original on 2021-11-21. Retrieved 2022-01-02.
- ↑ "Jayesh Ranjan (Secretary • IT and Electronics)". indiaai.gov.in. Archived from the original on 2022-01-02. Retrieved 2022-01-02.
- ↑ gtnews6 (2020-02-10). "తెలంగాణ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా జయేశ్ రంజన్". Great Telangaana (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2021-02-24. Retrieved 2022-01-02.