జయ జయ జయ జయహే 2022లో మలయాళంలో విడుదలైన కామెడీ డ్రామా సినిమా. చీర్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై లక్ష్మి వారియర్‌, గణేష్ మీనన్ నిర్మించిన ఈ సినిమాకు విపిన్ దాస్ దర్శకత్వం వహించాడు. బాసిల్ జోసెఫ్, దర్శన రాజేంద్రన్, అజు వర్గీస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అక్టోబరు 28న విడుదలైంది.[2] జయ జయ య జయహే మలయాళి చిత్రం.

జయ జయ జయ జయహే
దర్శకత్వంవిపిన్ దాస్
రచన
 • విపిన్ దాస్
 • నషీద్ మొహమ్మద్ ఫ్యామి
నిర్మాత
 • లక్ష్మి వారియర్‌
 • గణేష్ మీనన్
తారాగణం
ఛాయాగ్రహణంబబ్లూ ఐజు
కూర్పుజాన్ కుట్టి
సంగీతంఅంకిత్ మీనన్
నిర్మాణ
సంస్థ
చీర్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
పంపిణీదార్లుఐకాన్ సినిమాస్ రిలీజ్
విడుదల తేదీ
28 అక్టోబరు 2022 (2022-10-28)
సినిమా నిడివి
140 నిముషాలు
దేశంభారతదేశం
భాషమలయాళం
బడ్జెట్6 కోట్లు[1]

జయభారతి స్వతంత్ర భావాలు కలిగిన ఓ మధ్యతరగతి అమ్మాయి. కానీ మధ్యతరగతి కుటుంబం కావడం వల్ల తండ్రి డిగ్రీ కూడా పూర్తిగా చదివించలేకపోతాడు. జయభారతి అదే కాలేజీలోనే ప‌నిచేసే లెక్చ‌ర‌ర్‌ను ప్రేమిస్తుంది, వారి ప్రేమ విష‌యం ఇంట్లో తెలియ‌డంతో జ‌యకు ఇష్టం లేక‌పోయినా కోళ్ల ఫారం ఓనర్ రాజేష్ (బాసిల్ జోసెఫ్‌)తో ఆమె పెళ్లి చేస్తారు. అతనికి తండ్రి లేడు. తనే కోళ్ళవ్యాపారం చేస్తూ ఉంటాడు. ఎటువంటి సంస్కారం లేని మొరటువాడు. పెళ్లిచూపుల్లో జయ చదువుకుంటానంటే రాజేష్ ఒప్పుకొని పెళ్లి తర్వాత మాట మార్చేస్తాడు. ఈ క్రమంలోనే అత్తారింట్లో జరిగిన ఓ సంఘటన వల్ల జయ, రాజేశ్ నుంచి విడిపోవాలని నిర్ణయించుకుంటుంది. ఆ త‌ర్వాత రాజేష్ ఏం చేశాడు. జ‌య‌పై కోపంతో విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కిన రాజేష్‌కు ఎలాంటి ప‌రిణామాలు ఎదుర‌య్యాయి? అనేదే మిగతా సినిమా కథ.

 విపిన్ దర్శకత్వంలో, దర్శన రాజేంద్రన్, బాసిల్ నాయికా నాయకులుగా వివాహ బంధంలో స్త్రీపురుష సంబంధాన్ని విశ్లేషించిన చిత్రం. హాస్యరసం పైపూతలో పురుషులకు మింగుడు పడని అనేక పురుషాహంకార, పురుషస్వామ్య సమాజంలో స్త్రీ పాత్రను దర్శకుడు విశ్లేషిస్తాడు.
ఇది నాయికానిష్ఠమైన సినిమా. జయభారతి స్వతంత్ర భావాలు కలిగిన అమ్మాయి. కాలేజీలో జరిగిన ఒక సంఘటన వల్ల తలిదండ్రులు ఆకస్మికంగా ఆ యువతి వివాహం ఒక చిరు వ్యాపారి రాజేష్ తో కుదురుస్తారు.. కథానాయిక తో ఆమె ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండానే అతని పెళ్లి జరిగిపోతుంది.
రాజేష్ కు చెయ్యి దుడుకు. అతను చీటికీ మాటికీ భార్య చెంప ఛెళ్ళుమనిపిస్తూంటాడు. తల్లి,తండ్రి బంధువులు అందరూ ఆమెను సద్దుకుపొమ్మని చెబుతుంటారు. 21 పర్యాయాలు చెంపదెబ్బలు తినినతర్వాత తిరగబడుతుంది. శారీరికంగా అతనిపై ఆధిపత్యం పొందడంతో అతనికి క్రమంగా పరిస్థితులు అవగతమయి..చివరకు అతను విడాకులకు కోర్టు కెక్కుతాడు. హాస్యం పూతవెనక తాము ఉదారులమని భావించుకొనే పురుషులు కూడా ఆత్మావలోకనం చేసుకుని సిగ్గుపడాల్సిన సంఘటనలు సినిమా అంతటా ఉన్నాయి.దర్శన ముఖంలో, కన్నుల్లో అన్ని భావాలను వ్యక్తీకరించే నేర్పరి. ఈ సినిమాను తెలుగులో డబ్ చేశారు. 

Eenadu (26 December 2022). "రివ్యూ: జయ జయ జయ జయహే". Archived from the original on 14 January 2023. Retrieved 14 January 2023.</ref>

నటీనటులు

మార్చు
 • బాసిల్ జోసెఫ్
 • దర్శన రాజేంద్రన్
 • అజు వర్గీస్
 • అజీజ్‌
 • సీతల్‌
 • అజీస్ నెడుంగడ్
 • ఆనంద్ మన్మధ
 • మంజు పిళ్ళై
 • సుధీర్ పరవూర్
 • హరీష్ పెంగన్
 • శరత్ సభా
 • కుదస్సనాద్ కనకం
 • అరుంసోల్

సాంకేతిక నిపుణులు

మార్చు
 • బ్యానర్: చీర్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
 • నిర్మాత: లక్ష్మి వారియర్‌, గణేష్ మీనన్
 • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విపిన్ దాస్
 • సంగీతం: అంకిత్ మీనన్
 • సినిమాటోగ్రఫీ: బబ్లూ ఐజు
 • ఎడిటర్ : జాన్ కుట్టి


మూలాలు

మార్చు
 1. Eenadu (20 November 2022). "ఆరు కోట్లతో తీస్తే.. రూ.40 కోట్లు కలెక్ట్‌ చేసింది." Retrieved 14 January 2023. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
 2. Hindustantimes Telugu (20 November 2022). "తెలుగులోకి మలయాళ సంచలనం 'జయ జయ జయ జయహే'". Archived from the original on 14 January 2023. Retrieved 14 January 2023.

బయటి లింకులు

మార్చు