జర్మన్ జలాంతర్గామి యూ-180

రెండ్వ ప్రపంచ యుద్ధ కాలపు జర్మను జలాంతర్గామి

జర్మన్ జలాంతర్గామి యూ-180 (ఆంగ్లం: German submarine U-180) అనేది IXD1 రకం రవాణా U-బోట్. ఇది రెండవ ప్రపంచ యుద్ధ పమయంలోని నాజీ జర్మనీ క్రీగ్స్‌ మెరైన్. దీని కొనుగోలు కోసం 1940 మే 28న ఆర్డర్ చేయడం జరిగింది. 1941 ఫిబ్రవరి 25న నౌక బ్రెమెన్‌లోని ఎజి వెసర్, డ్యుయిష్ షిఫ్-ఉండ్ మస్చినెన్‌బౌ అనే సంస్థలు యార్డ్‌ నంబర్ 1020లో నిర్మాణం ప్రారంభించాయి. 1941 డిసెంబరు 10న ప్రయోగించారు. 1942 మే 16న ఫ్రెగటెన్‌కపిటన్ వెర్నర్ ముసెన్‌బర్గ్ (క్రూ 25) ఆధ్వర్యంలో ప్రారంభించబడింది. టార్పెడో ఆయుధాలను తొలగించి, టైప్ IXD1లు రవాణా జలాంతర్గాములుగా గుర్తించబడ్డాయి. ఇవి 252 టన్నుల వరకు సరుకు రవాణా చేయగలవు.[1] ముఖ్యంగా U-180 రహస్య కార్యకలాపాలలో వినియోగించబడేది. దీని పుంజం: 7.5 మీ., డ్రాఫ్ట్: 5.35 మీ.

1943 ఏప్రిల్ 28న U-180లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ (మొదటి పంక్తి లోని రెండవ ఎడమ) తో అతని సహాయకుడు, అబిద్ హసన్, ఇతర సిబ్బంది

రూపకల్పన

మార్చు

IXD1 రకం జలాంతర్గాములు టైప్ IXల కంటే చాలా పెద్దవి. U-180 ఉపరితలం వద్ద 1,610 టన్నులు, నీటిలో మునిగినప్పుడు 1,799 టన్నుల స్థానభ్రంశం కలిగి ఉంటుంది. U-బోట్ మొత్తం పొడవు 87.58 మీ., ఎత్తు 10.20 మీ. జలాంతర్గామి రెండు MAN M 9 V 40/46 సూపర్ఛార్జ్డ్ ఫోర్-స్ట్రోక్, తొమ్మిది-సిలిండర్ డీజిల్ ఇంజన్లు, రెండు MWM RS34.5S సిక్స్-సిలిండర్ ఫోర్-స్ట్రోక్ డీజిల్ ఇంజన్లతో క్రూజింగ్ శక్తిని కలిగి ఉంటుంది. మొత్తం 9,000 మెట్రిక్ హార్స్‌పవర్ (6,620 kW) ఉత్పత్తి అవుతుంది. దీనికి రెండు షాఫ్ట్‌లు, రెండు 1.90 మీ. ప్రొపెల్లర్లు ఉన్నాయి. పడవ 200 మీటర్లు లోతులో కూడా ప్రయానించగలదు. జలాంతర్గామి గరిష్ఠ ఉపరితల వేగం 20.8 నాట్‌లు, గరిష్ఠంగా 6.9 నాట్లు అంటే గంటకు 12.8 కి.మీ. అదే నీటిలో 121 నాటికల్ మైళ్లు అంటే 224 కి.మీ. అన్నమాట. ఇందులో యాభై ఐదు మంది ప్రయాణించగలరు.

చరిత్ర

మార్చు
నాజీ జర్మనీ
పేరు U-180
ఆర్డర్ 1940 మే 28
బిల్డర్ DeSchiMAG ఎజి వెసర్, బ్రెమెన్
యార్డ్ నంబర్ 1020
శంకుస్థాపన 1941 ఫిబ్రవరి 25
ఆరంభించబడినది 1941 డిసెంబరు 10
కమిషన్ చేయబడింది 1942 మే 16
మునిగిపోయినది 1944 ఆగస్టు 23

రైడింగ్ చరిత్ర

మార్చు
Date Ship Nationality Tonnage Fate[2]
18 April 1943 Corbis   United Kingdom 8,132 Sunk
3 June 1943 Boris   Greece 5,166 Sunk

మీడియా

మార్చు

మూలాలు

మార్చు
  1. "German Transport Boats to the Far East". www.uboataces.com. Retrieved 2009-12-04.
  2. Helgason, Guðmundur. "Ships hit by U-180". German U-boats of WWII - uboat.net. Retrieved 29 December 2014.