జలచక్రం
జలచక్రం ను నీటి చక్రం, హైడ్రాలిక్ చక్రం, H2O చక్రం అని కూడా అంటారు, ఈ నీటి చక్రం భూమిపై వాతావరణంలో, భూగర్భంలో, భూ ఉపరితలంపై నీరు యొక్క నిరంతర కదలికల గురించి వివరిస్తుంది. నీరు బాష్పీభవనం చెంది నీటి ఆవిరిగా మారటం, నీటి ఆవిరి మేఘాలుగా రూపొందటం, మేఘాలు తిరిగి సాంద్రీకరణం ద్వారా వర్షంగా కురవటం ఒకదాని వెంట ఒకటి జరుగుతూ ఉంటాయి. ఈ ప్రక్రియ లన్నింటినికలిపి జలచక్రం అంటారు.
జలచక్రం యేర్పడు విధానం
మార్చువర్షం కురిసినప్పుడు చెరువులు, కుంటలు నిండుతాయి. నీరు చిన్న చిన్న కాలువలుగా ప్రవహిస్తుంది. ఇలాంటివే చాలా కలిసిపోయి పెద్దపెద్ద ప్రవాహాలుగా మారుతాయి. ఈ పెద్దపెద్ద ప్రవాహాలు నదులలో కలుస్తాయి. నదులు సముద్రాలలోకి, మహా సముద్రాలలోకి ప్రవహిస్తాయి. కొంత వర్షపునీరు భూమిలోకి ఇంకి భూగర్భ జలాలుగా మారుతుంది. వేసవి కాలంలోని అధిక వేడిమివల్ల ఎక్కువ మొత్తంలో నీరు సముద్రాలు, సరస్సులు, నదులు మొదలైన చోట్ల నుండి బాష్పీభవనం చెంది నీటి ఆవిరిగా మారుతుంది. ఇది గాలిలోకి చేరి మేఘాలుగా రూపొందుతుంది. ఈ మేఘాలు చల్లబడినప్పుడు వర్షం కురుస్తుంది.
భూమిపై నీటి రూపాలు
మార్చుభూమిపై నీరు మూడు రూపాలలోకి మారుతుంది. మంచు (ఘనరూపం), నీరు (ద్రవరూపం), నీటిఆవిరి (వాయురూపం). నీరు నీటి ఆవిరిగా మారే ప్రక్రియను బాష్పీభవనమంటారు. నీటి ఆవిరి నీరుగా మారే ప్రక్రియనే సాంద్రీకరణమంటారు. నీరు మంచుగా మారటాన్ని నీటి ఘనీభవనం అంటారు.
నివాస కాలాలు
మార్చుజలాశయం | సగటు నివాస సమయం |
---|---|
అంటార్కిటికా | 20,000 సంవత్సరాలు |
మహాసముద్రాలు | 3,200 సంవత్సరాలు |
హిమనీనదాలు | 20 నుంచి 100 సంవత్సరాలు |
కాలానుగుణంగా పేరుకున్న మంచు | 2 నుంచి 6 నెలలు |
నేలలోని తేమ | 1 నుంచి 2 నెలలు |
భూగర్భజలం: లోతు తక్కువ | 100 నుంచి 200 సంవత్సరాలు |
భూగర్భజలం: అగాధం | 10,000 సంవత్సరాలు |
సరస్సులు | 50 నుంచి 100 సంవత్సరాలు |
నదులు | 2 నుంచి 6 నెలలు |
వాతావరణం | 9 రోజులు |
ప్రక్రియలు
మార్చుఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ PhysicalGeography.net. CHAPTER 8: Introduction to the Hydrosphere. Retrieved on 2006-10-24.