జలియన్ వాలాబాగ్
భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రంలో అమృత్సర్లో గల ఒక పబ్లిక్ గార్డెన్ జలియన్ వాలాబాగ్. 1919 ఏప్రిల్ 13 న పంజాబీ న్యూ ఇయర్. ఈ సందర్భంగా ఈ ఉద్యానవనంలో సమావేశమైన శాంతియుత వేడుకరులను బ్రిటిష్ దళాలు చుట్టుముట్టి వారిపై మారణకాండ జరిపింది, ఇక్కడ జరిగిన ఈ దురంతమే జలియన్ వాలాబాగ్ దురంతం. ఈ దుర్ఘటనలో మరణించిన వారి జ్ఞాపకార్ధం 1951 లో ఒక స్మారకం స్థాపించబడింది. ఈ స్మారకం జాతీయ ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ 6.5 ఎకరాల (26,000 m2) గార్డెన్, సిక్కుల పవిత్ర పుణ్యకేత్రమైన స్వర్ణ దేవాలయానికి సమీపంలో ఉంది.
జలియన్ వాలాబాగ్ దురంతం
మార్చుజలియన్ వాలాబాగ్ దురంతం భారత స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో జరిగిన అత్యంత దురదృష్టమైన సంఘటన. జలియన్ వాలాబాగ్ అనేది ఉత్తర భారతదేశంలోని అమృత్‌సర్ పట్టణంలో ఒక తోట. 1919 ఏప్రిల్ 13 న బ్రిటీష్ సైనికులు జనరల్ డయ్యర్ సారథ్యంలో ఈ తోటలో సమావేశమైన నిరాయుధులైన స్త్రీ, పురుషులు, పిల్లలపైన విచక్షణారహితంగా కాల్పులు జరిపారు[1][2]. ఈ కాల్పులు పది నిమిషాలపాటు కొనసాగాయి. 1650 రౌండ్లు కాల్పులు జరిగాయి. అప్పటి ఆంగ్ల ప్రభుత్వ లెక్కల ప్రకారం 379 మంది మరణించారు. కానీ ఇతర గణాంకాల ప్రకారం అక్కడ 1000 కి పైగా మరణించారు[3]. 2000 మందికి పైగా గాయపడ్డారు.
చిత్రమాలిక
మార్చు-
తోటలో గల అమరవీరుల స్మారక బావి
-
పార్క్ లోకి ప్రవేశించే ఇరుకైన దారి
-
ఇక్కడి నుంచే ఇరవై వేల మంది అమాయకులపై 1600 రౌండ్ల బుల్లెట్లను సైనికులు కాల్చారు
-
పార్క్ ఆవరణలోని గోడలపై బుల్లెట్లు దిగిన గుర్తులు
మూలాలు
మార్చు- ↑ Jallianwala Bagh commemoration volume and Amritsar and our duty to India. Publication Bureau, Punjabi University. 1994. ISBN 978-81-7380-388-8.
- ↑ Datta, Vishwa Nath (1969). Jallianwala Bagh. [Kurukshetra University Books and Stationery Shop for] Lyall Book Depot.
- ↑ Home Political Deposit, September, 1920, No 23, National Archives of India, New Delhi; Report of Commissioners, Vol I, New Delhi