జహానాబాద్
బీహార్ రాష్ట్రం లోని పట్టణం
జహానాబాద్ బీహార్ రాష్ట్రం, జహానాబాద్ జిల్లా లోని పట్టణం. ఇది ఈ జిల్లాకు ముఖ్యపట్టణం.
జహానాబాద్ | |
---|---|
నగరం | |
Coordinates: 25°13′N 84°59′E / 25.217°N 84.983°E | |
దేశం | India |
రాష్ట్రం | బీహార్ |
జిల్లా | జహానాబాద్ |
జనాభా (2011) | |
• Total | 1,03,282 |
భాషలు | |
• అధికారిక | హిందీ |
Time zone | UTC+5:30 (IST) |
PIN | |
ISO 3166 code | IN-BR |
Vehicle registration | BR-25 |
Website | http://www.jehanabad.bih.nic.in |
జనాభా వివరాలు
మార్చు2001 భారత జనాభా లెక్కల ప్రకారం, జహానాబాద్ జనాభా 1,35,196. జనాభాలో 54% పురుషులు, 46% స్త్రీలు. పట్టణంలో అక్షరాస్యత 77%, ఇది జాతీయ సగటు 74.04% కంటే ఎక్కువ. పురుషుల్లో అక్షరాస్యత 83% కాగా, స్త్రీలలో అక్షరాస్యత 69%. జహానాబాద్ జనాభాలో 16% మంది ఆరేళ్ళ లోపు పిల్లలు [1]
రవాణా సౌకర్యాలు
మార్చుజాతీయ రహదారి 83, జాతీయ రహదారి 110 నగరం గుండా వెళుతున్నాయి. జార 83 పాట్నా నుండి మసౌర్హి మీదుగా, నేరుగా మఖ్దంపూర్ ద్వారా గయ వెళుతుంది. ఇది రైలు మార్గానికి దాదాపు సమాంతరంగా నడుస్తుంది. సరైన నాణ్యత లేని పిడబ్ల్యుడి రోడ్లు, ఆర్‌ఇఒ రోడ్లు జిల్లా అంతటా విస్తరించి ఉన్నాయి. పక్కా రహదారుల మొత్తం పొడవు 541.65 కి.మీ., కచ్చా రోడ్లు 450.90 కి.మీ. [2]
మూలాలు
మార్చు- ↑ "Census of India 2001: Data from the 2001 Census,(Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.
- ↑ "PinCode of Jehanabad". citypincode.in. Archived from the original on 2014-05-19. Retrieved 2014-05-19.