జాతీయ గ్రంథాలయం, ఇజ్రాయిల్
31°46′33.01″N 35°11′48.58″E / 31.7758361°N 35.1968278°E
ఇజ్రాయిల్ జాతీయ గ్రంథాలయం ( National Library of Israel) ఇజ్రాయెల్ దేశంలోని అతి పెద్ద గ్రంథాలయం. ఈ లైబ్రరీలో ఇది ఇజ్రాయెల్, యూదుల వారసత్వ సాంస్కృతిక సంపదను సేకరించడానికి అంకితమైన గ్రంథాలయం. ఈ గ్రంథాలయంలో 5 మిలియన్లకు పైగా పుస్తకాలు ఉన్నాయి. ఇది జెరూసలేం హిబ్రూ విశ్వవిద్యాలయం యొక్క గివాట్ రామ్ క్యాంపస్‌లో ఉంది. నేషనల్ లైబ్రరీ ప్రపంచంలోని అతిపెద్ద హెబ్రాయికా, జుడైకా సేకరణలను కలిగి ఉంది. ఇది చాలా అరుదైన, ప్రత్యేకమైన రాతప్రతి పుస్తకాలు, కళాఖండాలు ఉన్నాయి.
చరిత్ర
మార్చుజోసెఫ్ చాజనోవిట్జ్ (1844-1919) ఆలోచన ఫలితంగా జెరూసలెంలో యూదుల జాతీయ గ్రంథాలయ స్థాపించాడు. అతని ఆలోచన "విదేశీ సంస్కృతులలో సృష్టించినప్పటికీ, యూదు రచయితలను కలిగి ఉన్న అన్ని భాషలు, సాహిత్యాలలో అన్ని రచనలకు గ్రంథాలయం" సృష్టించడం. చాజనోవిట్జ్ సుమారు 15,000 సంపుటాలను సేకరించాడు. తరువాత ఇది ప్రథాన గ్రంథాలయంగా మారింది[1].
1892 లో జెరూసలెంలో స్థాపించబడిన బినాయ్ బ్రిత్ లైబ్రరీ, పాలస్తీనాలో యూదు సమాజానికి సేవ చేసిన మొదటి ప్రజా గ్రంథాలయం. ఈ గ్రంథాలయం మీహ్ షెరిమ్ పరిసరాలు, రష్యన్ కాంపౌండ్ మధ్య గల బినాయ్ బ్రిత్ వీధిలో ఉంది.[2] పది సంవత్సరాల తరువాత అప్పటికి తెలిసిన బెట్ మిడ్రాష్ అబ్రబనేల్ గ్రంథాలయం ఇథియోపియా వీధికి మార్చబడింది[3]. 1920 లో, హిబ్రూ విశ్వవిద్యాలయం కోసం ప్రణాళికలు రూపొందించినప్పుడు, బినాయ్ బ్రిత్ గ్రంథాలయంలోని పుస్తకాలు విశ్వవిద్యాలయ గ్రంథాలయానికి ఆధారం అయ్యాయి. ఐదు సంవత్సరాల తరువాత విశ్వవిద్యాలయం ప్రారంభమైనప్పుడు పుస్తకాలను మౌంట్ స్కోపస్‌కు తరలించారు.[2]
1948 లో, మౌంట్ స్కోపస్‌లోని విశ్వవిద్యాలయ ప్రాంగణంలోనికి ప్రవేశం నిరోధించబడినప్పుడు, చాలా పుస్తకాలను రెహావియాలోని టెర్రా సాంక్టా భవనంలోని విశ్వవిద్యాలయానికి చెందిన తాత్కాలిక గృహాలకు తరలించారు. ఆ సమయానికి, విశ్వవిద్యాలయ సేకరణలో ఒక మిలియన్ పుస్తకాలు ఉన్నాయి. స్థలం లేకపోవడంతో, కొన్ని పుస్తకాలను నగరం చుట్టూ స్టోర్ రూమ్‌లలో ఉంచారు. 1960 లో, వాటిని గివత్ రామ్‌లోని కొత్త జెఎన్‌యుఎల్ భవనానికి తరలించారు[4].
1970 ల చివరలో, మౌంట్ స్కోపస్‌లోని కొత్త విశ్వవిద్యాలయ సముదాయాన్ని ప్రారంభించినప్పుడు, న్యాయ, హ్యుమానిటీస్, సోషల్ సైన్స్ అధ్యాపకులు అక్కడకు తిరిగి వచ్చినప్పుడు, ఆ క్యాంపస్‌లో డిపార్ట్‌మెంటల్ లైబ్రరీలు ప్రారంభించబడ్డాయి. గివాట్ రామ్ లైబ్రరీకి సందర్శకుల సంఖ్య పడిపోయింది. 1990 వ దశకంలో, భవనం వర్షపునీటి లీకేజీలు, పురుగుల బారిన పడటం వంటి నిర్వహణ సమస్యలు ఏర్పడ్డాయి.[5]
2007 లో, లైబ్రరీ అధికారికంగా నేషనల్ లైబ్రరీ లా ఆఫ్ ఇజ్రాయెల్ గా గుర్తించబడింది. 23 జూలై 2008 నుండి అమల్లోకి వచ్చిన ఈ చట్టం, లైబ్రరీ పేరును "నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఇజ్రాయెల్" గా మార్చి తాత్కాలికంగా విశ్వవిద్యాలయం అనుబంధ సంస్థగా మార్చింది[6]. తరువాత పూర్తిగా స్వతంత్ర కమ్యూనిటీ ఇంటరెస్ట్ కంపెనీగా మారింది. ఇది ఇజ్రాయెల్ (50%), హిబ్రూ విశ్వవిద్యాలయం (25%), ఇతర సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న గ్రంథాలయంగా రూపొందింది.
2011 లో, గ్రంథాలయం దాని సేకరణల నుండి పుస్తకాలు, పత్రికలు, పటాలు, ఫోటోలు, సంగీతాన్ని ప్రజలకు ప్రవేశం కల్పించేందుకు వెబ్‌సైట్‌ను ప్రారంభించింది.[7]
2014 లో, జెరూసలెంలోని లైబ్రరీ కొత్త గృహం కోసం ప్రాజెక్ట్ ఆవిష్కరించబడింది. బాసెల్ ఆధారిత ఆర్కిటెక్చర్ సంస్థ హెర్జోగ్ & డి మీరాన్ రూపొందించిన 34,000 చదరపు మీటర్ల భవనం 2021 లో పూర్తి కావలసి ఉంది.[8][9]
గ్యాలరీ
మార్చుమూలాలు
మార్చు- ↑ Melancholy Pride: Nation, Race and Gender in the German Literature of Cultural Zionism, Mark Gelber
- ↑ 2.0 2.1 Aryeh Dayan. "New chapter in a sad saga". Haaretz. Retrieved 2017-05-29.
- ↑ "Hebrew University Hails 'Landmark Legislation' for the Establishment of the National Library". Canadian Friends of the Hebrew University. 2007-11-27. Archived from the original on 17 September 2017. Retrieved 2008-10-01.
- ↑ Aryeh Dayan. "New chapter in a sad saga". Haaretz. Retrieved 2017-05-29.
- ↑ Aryeh Dayan. "New chapter in a sad saga". Haaretz. Retrieved 2017-05-29.
- ↑ Aryeh Dayan. "New chapter in a sad saga". Haaretz. Retrieved 2017-05-29.
- ↑ Israel's National Library puts collection online
- ↑ "herzog & de meuron reveals designs for national library of israel". Designboom. Retrieved December 9, 2014.
- ↑ Herzog & de Meuron Share New Images of the National Library of Israel, ArchDaily, 14 April 2016