జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ కమిషన్

జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఆంగ్లం:National Consumer Disputes Redressal Commission) 1986లో చట్టం అమల్లోకి వచ్చి కమిషన్ 1988లో ఏర్పడింది. ఇది శాసనబద్ధమైన సంస్థ. 2024 నాటికి, పాట్నా, మద్రాస్ హైకోర్టుల మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అమరేశ్వర్ ప్రతాప్ సాహి నేతృత్వం వహిస్తున్నారు.[1]

జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ కమిషన్
సంస్థ అవలోకనం
స్థాపనం 1988[1]
అధికార పరిధి భారతదేశం
ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ[2]
ఏజెన్సీ కార్యనిర్వాహకుడు/ జస్టిస్ ఆర్.కె. అగర్వాల్, ఛైర్మన్‌

నిర్మాణం, నియామకం, పదవీ కాలం

మార్చు

జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ కమిషన్‌లో ఒక చైర్మన్‌, 10 మంది సభ్యులు ఉంటారు. వీరి పదవీ కాలం 3 సంవత్సరాలు. వీరి నియామకం, తొలగింపు అధికారాలు కేంద్ర ప్రభుత్వానికే ఉంటాయి.[3]

విధులు

మార్చు
  1. హానికరమైన వస్తువులు లేదా సేవల నుంచి వినియోగదారులను రక్షించడం
  2. కోటి రూపాయల ఆస్తి విలువ గల వస్తువులపై కమిషన్‌ విచారిస్తుంది.
  3. విచారణలో ఏకీకృత విచారణ పద్ధతిని అమలు చేయడం.
  4. ఈ కమిషన్‌ వినియోగదారులకు ఆరు హక్కులను కల్పించాలి.

1.భద్రతా హక్కు 2.అవగాహన హక్కు 3. ఎంపిక హక్కు 4. సమాచారం తెలుసుకునే హక్కు 5.సమస్య పరిష్కారం హక్కు 6. విన్నవించుకునే హక్కు [4]

జరిమానాలు, శిక్షలు

మార్చు
  1. వాణిజ్య ప్రకటన ద్వారా తప్పుదోవ పట్టిస్తే రూ.10 లక్షల జరిమానా, రెండేండ్ల జైలు
  2. రెండోసారి నేరం రుజువైతే రూ.50 లక్షల జరిమానాతో పాటు జైలు శిక్ష
  3. ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్‌ లావాదేవీలకు చట్టం వర్తింపు
  4. ఎలక్ట్రానిక్‌ మార్గాలు, టెలీషాపింగ్‌, ప్రత్యక్ష అమ్మకం, బహుళస్థాయి మార్కెటింగ్‌ వివాదాల పరిష్కారం

ఫీజులు

మార్చు
  • రూ.లక్ష నుంచి 5లక్షల లోపు విలువైన వివాదాలకు ఫీజు ఉండదు
  • రూ.5 నుంచి 10లక్షల లోపు రూ.200
  • రూ.10నుంచి రూ.20 లక్షలలోపు రూ.400
  • రూ.20లక్షల నుంచి రూ.50లక్షల వరకు రూ.వెయ్యి
  • రూ.50లక్షల నుంచి రూ.కోటి వరకు రూ.2 వేల నామమాత్రపు ఫీజు మాత్రమే వినియోగదారుడు చెల్లించాలి.[5]

ఇవి కూడా చుడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "NCDRC Website Home Page". NCDRC. Archived from the original on 21 July 2011. Retrieved 18 December 2012.
  2. "NCDRC - Contact Info". NCDRC. Archived from the original on 28 జనవరి 2013. Retrieved 25 ఆగస్టు 2021.
  3. Andrajyothy (2 January 2018). "వినియోగదారుల హక్కులివే..తెలుసుకుంటే చిక్కులుండవు!". Archived from the original on 25 ఆగస్టు 2021. Retrieved 25 August 2021.
  4. Sakshi (2015). "జాతీయ కమిషన్లు-విధులు" (in ఇంగ్లీష్). Archived from the original on 24 ఆగస్టు 2021. Retrieved 24 August 2021.
  5. Namasthe Telangana (15 March 2021). "హక్కుల కోసం న్యాయపోరాటం". Archived from the original on 25 ఆగస్టు 2021. Retrieved 25 August 2021.