జాతీయ వైద్య కమిషన్
జాతీయ వైద్య కమిషన్ దేశంలో వైద్య విద్య, వృత్తి యొక్క అత్యున్నత నియంత్రకం కోసం ఏర్పాటైన కమిషన్. జాతీయ వైద్య కమిషన్ బిల్లు - 2019ను పార్లమెంట్ ఆమోదించింది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసిఐ) స్థానంలో నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసి) ఏర్పాటు చేయడంతో ఇండియన్ మెడికల్ కౌన్సిల్స్ యాక్ట్ -1956 ప్రకారం ఏర్పాటైన ఎంసీఐ దాదాపు ఏడు దశాబ్దాల పాటు పనిచేసి రద్దయ్యింది. యూజీ, పీజీ విద్య, సంబంధిత వైద్య సంస్థల సమీక్ష, ప్రమాణాలు, అభ్యాసకుల రిజిస్ట్రేషన్ ను ఈ కమిషన్ పర్యవేక్షిస్తుంది. జాతీయ వైద్య కమిషన్ బిల్లుకు రాష్ట్రపతి 2019 ఆగస్టు 9న ఆమోదం తెలిపాడు.[1]
సంకేతాక్షరం | ఎన్‌ఎంసి) |
---|---|
ముందువారు | భారత వైద్య మండలి |
స్థాపన | 25 సెప్టెంబరు 2020 |
కేంద్రీకరణ | వైద్య విద్య, వృత్తి నియంత్రణ |
ప్రధాన కార్యాలయాలు | న్యూఢిల్లీ |
చైర్పర్సన్ | డా. సురేష్ చంద్ర శర్మ |
ప్రధానభాగం | కమిషన్ |
అనుబంధ సంస్థలు | కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ |
జాలగూడు | https://www.nmc.org.in/ |
బోర్డ్లు
మార్చుఎన్ఎంసీ పరిధిలో వైద్యవిద్యను నియంత్రించేందుకు మొత్తం నాలుగు బోర్డులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.[2]
- అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు
- పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు
- మెడికల్ అసెస్‌మెంట్ అండ్ రేటింగ్ బోర్డు ఫర్ ఇండియన్ సిస్టం ఆఫ్ మెడిసిన్
- బోర్డు ఆఫ్ ఎథిక్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఫర్ ఇండియన్ సిస్టం ఆఫ్ మెడిసిన్
ఈ బోర్డులన్నీ స్వయంప్రతిపత్తి సంస్థలుగా వ్యవహరిస్తాయి.
- మెడికల్ అసెస్‌మెంట్, ఎథిక్స్ అండ్ రిజిస్ట్రేషన్ బోర్డుల్లో ఒక్కో దాంట్లో అధ్యక్షుడితో పాటు ఎనిమిది మంది సభ్యులుంటారు.
- దేశంలో వైద్యవ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో ఈ బోర్డులు క్రియాశీలకంగా పనిచేస్తాయి.
సభ్యులు
మార్చుజాతీయ వైద్య కమిషన్ ఛైర్మన్‌గా డాక్టర్ సురేష్ చంద్ర శర్మను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆయన మూడేళ్ల పాటు ఛైర్మన్‌గా విధులు నిర్వహించనున్నాడు.[3] జాతీయ వైద్య కమిషన్‌లో కార్యదర్శి, ఛైర్మన్‌తో పాటు, 10 మంది ఎక్స్-అఫిషియో సభ్యులు, కేంద్ర ప్రభుత్వం నియమించిన 22 మంది పార్ట్‌టైమ్ సభ్యులు ఉంటారు.
మూలాలు
మార్చు- ↑ Suryaa (9 August 2019). "జాతీయ వైద్య కమిషన్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర". Archived from the original on 29 ఆగస్టు 2021. Retrieved 29 August 2021.
- ↑ "THE NATIONAL MEDICAL COMMISSION BILL, 2019" (PDF). 29 July 2019. Archived from the original (PDF) on 20 సెప్టెంబరు 2021. Retrieved 9 May 2021.
- ↑ ANI News (25 September 2020). "National Medical Commission takes charge, Medical Council of India abolished" (in ఇంగ్లీష్). Archived from the original on 29 ఆగస్టు 2021. Retrieved 29 August 2021.