జాన్ ఆడమ్స్ (అమెరికా అధ్యక్షుడు)
John Adams (October 30 [O.S. October 19] 1735 – July 4, 1826) జాన్ ఆడమ్స్ అమెరికాకు చెందిన రాజనీతివేత్త, ప్రముఖ న్యాయవాది, దౌత్యవేత్త, అమెరికా వ్యవస్థాపక పితృలుగా పిలువబడే ఐదుగురిలో ఒకరు. ఆడమ్స్ అమెరికా రెండవ దేశాధ్యక్షులుగా (1797–1801) పనిచేసారు. మొట్టమొదటి దేశ ఉపాధ్యక్షుడిగా (1789–97) వరకు పనిచేసారు. బ్రిటన్ నుండి అమెరికా విముక్తి కొరకు చేసిన ఉద్యమ నాయకుడిగా వ్యవహరించారు. అమెరికా ఉద్యమ సమయంలో సన సోదరుడైన సామ్యూల్ ఆడమ్స్ తో కలిసి పనిచేశాడు. "బోస్టన్ మారణకాండ"కు సంబంధించి బ్రిటిషు దళాలకు వ్యతిరేకంగా తన వాదనను వినిపించాడు.
John Adams | |||
![]() John Adams by John Trumbull, c. 1792 | |||
ఉపరాష్ట్రపతి | Thomas Jefferson | ||
---|---|---|---|
అధ్యక్షుడు | George Washington | ||
Delegate to the Second Continental Congress from Massachusetts
| |||
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | Federalist | ||
జీవిత భాగస్వామి | |||
సంతానం | Abigail, John Quincy, Susanna, Charles, Thomas, and Elizabeth | ||
పూర్వ విద్యార్థి | Harvard College | ||
సంతకం | ![]() |
"అమెరికా స్వాతంత్ర్యపకటన" పత్రాన్ని రచించుటలో జెఫర్సన్కు, జాన్ ఆడమ్స్ తన సహకారాన్ని అందించాడు. అమెరికా స్వాతంత్ర్యం తరువాత బ్రిటన్ తో శాంతి ఒప్పందాన్ని ప్రతిపాదించాడు. మసాచుసెట్స్ రాష్ట్రానికి రాజ్యాంగాన్ని రచించారు. అమెరికా దేశ 6వ అధ్యక్షుడైన "జాన్ క్విన్సీ ఆడమ్స్"కు జాన్ ఆడమ్స్ స్వయానా తండ్రి. జాన్ ఆడమ్స్ "అమెరికా స్వాతంత్ర్య ప్రకటన" రచించి 50 యేళ్ళు పూర్తయిన రోజున మరణించారు జూలై 4 1826. సరిగ్గా అదే రోజు దాన్ని రచించిన ప్రముఖ వ్యక్తి థామస్ జెఫర్సన్ కూడా మరణించారు.