తన నాటకాలు, విశిష్ట రచన శైలితో అవ్యుక్తాన్ని వ్యక్తీకరించడంలో సిద్ధహస్తుడైన నార్వే దేశ రచయిత జాన్ ఫాసే కు 2023 నోబుల్ సాహిత్య పురస్కారాన్ని 2023 అక్టోబర్ 5వ తేదీన ఎంపిక కమిటీ ప్రకటించింది[1]. మానవుల్లోని అభద్రత భావాలను జాన్ ఫాసే రచనలు బలంగా వ్యక్తీకరిస్తాయని పేర్కొంది[2]. ఇప్పటివరకు 40 నాటకాలు, నవలలు, బాలల పుస్తకాలు, కథానికలు, కవితలు, వ్యాసాలు రచించిన జాన్ ఫాసే 1969 లో నోబుల్ సాహిత్య బహుమతి పొందిన రచయిత శామ్యూల్ బకెట్ నుండి స్ఫూర్తి పొందానని తెలియజేశారు[3]. జాన్ ఫాసేతో కలిపి ఇప్పటివరకు నలుగురు నార్వే రచయితలకు నోబెల్ సాహిత్య పురస్కారం లభించింది[4]. 54 లక్షల జనాభా గల నార్వే దేశంలో అధికార రచన శైలిలో ఒకటైన బొక్మాల్ ను అధికారికంగాను, పత్రిక భాషల్లోనూ ఉపయోగిస్తారు. జాన్ ఫాసే తొలి నవల ' రెడ్, బ్లాక్' 1983 సంవత్సరంలోనూ, తొలి నాటకం ' సమ్ వన్ ఈస్ గోయింగ్ టు కమ్ ' 1992 సంవత్సరంలోనూ ప్రచురితమయ్యాయి.

మూలాలు

మార్చు
  1. "నార్వే రచయిత ఫాసేకు నోబెల్‌". EENADU. Retrieved 2023-10-09.
  2. telugu, NT News (2023-10-05). "Nobel Prize: నార్వే ర‌చ‌యిత జాన్ ఫోసేకు సాహిత్యంలో నోబెల్ పుర‌స్కారం". www.ntnews.com. Retrieved 2023-10-09.
  3. "జాన్‌ ఫోసేకు సాహిత్య నోబెల్‌". Sakshi. 2023-10-06. Retrieved 2023-10-09.
  4. ABN (2023-10-06). "నార్వే రచయిత జాన్‌ ఫోసెకు సాహిత్య నోబెల్‌". Andhrajyothy Telugu News. Retrieved 2023-10-09.
"https://te.wikipedia.org/w/index.php?title=జాన్_ఫాసే&oldid=4266166" నుండి వెలికితీశారు