జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్
జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ (జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ ఎమ్మెస్సీ, JAM,జామ్, (ఆంగ్లం: Joint Admission Test for Masters)) ఇంజినీరింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ముఖ్యమైన విభాగాల్లో రిసెర్చ్‌లో నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ(IIT), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT)ల్లో పీజీ, పీహెచ్‌డీ కోర్సులను ప్రారంభించారు. వీటిలో ప్రవేశాల కోసం నిర్వహించే టెస్ట్ జామ్.[1]
ప్రారంభం
మార్చుఈ ఎంట్రెన్స్ టెస్ట్‌ను 2004 నుంచి ప్రారంభించారు. దీనిద్వారా ఎమ్మెస్సీ (నాలుగు సెమిస్టర్లు), ఎమ్మెస్సీ - పీహెచ్‌డీ, డ్యూయల్ డిగ్రీ తదితర ప్రోగ్రామ్స్‌ను ఐఐటీల్లో, ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీని ఐఐఎస్సీలో అందిస్తారు. -ప్రపంచస్థాయిలో నాణ్యమైన విద్య కోసం రూపొందించిన కరికులమ్‌తో ఈ ప్రోగ్రామ్స్‌ను రూపొందించారు.
భాగస్వామ్య విద్యాసంస్థలు
మార్చుఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ - భువనేశ్వర్, బాంబే, ఢిల్లీ, ధన్‌బాద్, గాంధీనగర్, గువాహటి, హైదరాబాద్, ఇండోర్, జోధ్‌పూర్, కాన్పూర్, ఖరగ్‌పూర్, మద్రాస్, పాట్నా, రూర్కీ, రోపర్‌తోపాటు బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ).
పరీక్ష విధానం
మార్చుమొత్తం ఏడు రకాల టెస్ట్ పేపర్లు ఉంటాయి. అవి..
- బయలాజికల్ సైన్సెస్ (బీఎల్),
- బయోటెక్నాలజీ (బీఎల్),
- కెమిస్ట్రీ (సీవై),
- జియాలజీ (జీజీ),
- మ్యాథమెటిక్స్ (ఎంఏ),
- మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ (ఎంఎస్),
- ఫిజిక్స్ (పీహెచ్). పరీక్ష ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహిస్తారు. పరీక్ష కాలవ్యవధి మూడు గంటలు.
మూలాలు
మార్చు- ↑ "జామ్ - 2018 (జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ ఎమ్మెస్సీ)". నమస్తే తెలంగాణ. Retrieved 11 September 2017.