జావాస్క్రిప్టు

ఒక ప్రోగ్రామింగ్ భాష

జావాస్క్రిప్టు (JS) అనేది ఒక గతిక కంప్యూటరు కార్యలేఖన భాష (object oriented programming language). జాల విహారిణులలో భాగంగా, సంకర్షక స్పందన (interactive effect) చూపించడానికి దీనిని చాలా విస్తృతంగా వినియోగిస్తారు. అనగా, దీనిని అమలు చెయ్యడం వలన క్లయింటు తరుపు స్క్రిప్టులను వాడుకరితో సంభాషించుటకు, విహారిణిని నియంత్రించుటకు, పత్ర విషయాలను మార్చడానికి అనుమతిస్తుంది. దీనిని సేవకము వైపు కార్యలేఖనంలో, ఆటల వికాసంలో, డెస్కుటాపు, మొబైల్ అనువర్తనాలను సృష్టించుటలో కూడా వినియోగించవచ్చు. ఇది లినక్స్, విండోస్ ఆపరేటింగు సిస్టంలో పని చేస్తుంది. ఇది బహుళ ఆపరేటింగు సిస్టంలో పని చేస్తుంది.

ప్రారంభంలో నెట్‌స్కేప్‌కు చెందిన బ్రెండన్ ఐచ్ రూపొందించారు. ఇతరులు ECMAScript ప్రమాణానికి కూడా సహకరించారు

ఉదాహరణ మార్చు

క్రింది కొడు తెరపై "Example" అని ముద్రిస్తుంది. // తో మొదలయ్యే పంక్తులు వ్యాఖ్యలు ఆ కొడు ఎమి చెస్తుందో చెబుతుంది.

 1 <script type="text/javascript">
 2 function example()
 3 {
 4   var ex = document.createTextNode('Prashanth'); // కంప్యూటర్ "Example" ను గుర్తు పెట్టుకుంటుంది , 
 5                         //కాబట్టి మీరు "ex" అని చెప్పినప్పుడు కంప్యూటర్ "Example"అని అర్థం చేసుకుంటుంది.
 6   document.body.appendChild(ex);        //వెబ్పేజీ దిగువ భాగంలో వచనాన్ని ఉంచండి
 7 }
 8 example();
 9 
10 /*
11 * క్రింద ఉన్న కోడ్, పైన ఉన్న కోడ్ దాదాపు ఒకే విషయం చేస్తుంది, 
12 * కానీ అది పాప్అప్ బాక్స్ లో "Example" ను చూపిస్తుంది, కోడ్ తక్కువగా ఉంటుంది..
13 *
14 * ఇది కూడా ఒక వ్యాఖ్యే.
15 */
16 
17 alert("Example");
18 </script>

జావాస్క్రిప్ట్ <script> </script> హెచ్.టి.ఎం.ఎల్. ట్యాగ్లచే జతచేయబడి ఉంటుంది. తద్యారా అది సాదారణ పదాలు కాదు జావాస్క్రిప్ట్ అని తెలుస్తుంది.