జావిద్ హసన్ బేగ్

జావిద్ హసన్ బేగ్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014, 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో బారాముల్లా నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3][4]

జావిద్ హసన్ బేగ్ మాజీ డిప్యూటీ సీఎం ముజఫర్ బేగ్ మేనల్లుడు. ఆయన 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత అల్తాఫ్ బుఖారీ అప్నీ పార్టీకి మారాడు. జావిద్ హసన్ బేగ్ ఆర్టికల్ 370 రద్దు తర్వాత కేంద్రానికి కాశ్మీరీ నాయకత్వం మొదటిసారిగా చేరువైన బుఖారీతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను కలిసిన ప్రతినిధి బృందంలో ఉన్నాడు.

జావిద్ హసన్ బేగ్ 2024 మార్చిలో తిరిగి నేషనల్ కాన్ఫరెన్స్‌లో చేరాడు.

మూలాలు

మార్చు
  1. India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  2. "J&K Assembly Election Results 2024 - Baramulla". 8 October 2024. Archived from the original on 10 October 2024. Retrieved 10 October 2024.
  3. India Today (8 October 2024). "Baramulla, Jammu and Kashmir Assembly Election Results 2024 Highlights: JKNC's Javid Hassan Baig wins Baramulla with 22523 votes" (in ఇంగ్లీష్). Archived from the original on 10 October 2024. Retrieved 10 October 2024.
  4. TimelineDaily (8 October 2024). "J&K Assembly Election Results 2024: Javid Hassan Baig Wins In Baramulla Constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 10 October 2024. Retrieved 10 October 2024.