జావేద్ అహ్మద్ తక్
జావేద్ అహ్మద్ తక్ జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి సామజిక సేవకుడు. ఆయన దివ్యాంగులకు రెండు దశాబ్దాలుగా సాయం అందిస్తున్నాడు. జావేద్ అహ్మద్ తక్ నిస్వార్థ సేవను గుర్తించిన భారత ప్రభుత్వం ఆయనను 2020లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.[1] జావేద్ అహ్మద్ తక్ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో 2021 నవంబరు 8న రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతులమీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నాడు.[2]
జావేద్ అహ్మద్ తక్ | |
---|---|
జననం | బిజ్బెహారా, జమ్మూ కాశ్మీర్, భారతదేశం |
వృత్తి | సామజిక సేవకుడు |
పురస్కారాలు | పద్మశ్రీ (2020) |
జీవితాన్ని మార్చిన సంఘటన
మార్చుదక్షిణ కాశ్మీర్ లోని శ్రీనగర్ నుండి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్నబిజ్బెహారా పట్టణంలో ఉగ్రవాద దాడిలో జావేద్ అహ్మద్ తక్ పై కాల్పులు జరిపారు, 21 సంవత్సరాల వయస్సులో అతని వెన్నెముక, మూత్రపిండాలు, క్లోమం, ప్రేగులను దెబ్బ తిన్నాయి. అయన దాదాపు రెండేళ్ల పాటు ఆసుపత్రిలో చేరినా అతని ఆరోగ్యం కుదుటపడలేదు. జావేద్ అహ్మద్ తక్ తన వీల్ చైర్ లో తన పరిసరాల్లో నివసిస్తున్న పేద, ఆర్థికంగా వెనుకబడిన పిల్లలకు బోధించడం ప్రారంభించాడు.
జావేద్ అహ్మద్ తక్ కాశ్మీర్ విశ్వవిద్యాలయం నుండి సోషల్ వర్క్ లో మాస్టర్స్ పూర్తి చేసి అయన వికలాంగ సమాజం, కుష్టు వ్యాధితో బాధపడుతున్న ఇతర అట్టడుగు వర్గాల హక్కుల కోసం పోరాడటం ప్రారంభించాడు. పరిస్థితులు మెరుగై వైకల్యం ఉన్నవారి అవకాశాల కోసం వాదించే విజయవంతమైన పిఎల శ్రేణిని దాఖలు చేసిన తరువాత అతను కాశ్మీర్ లోయ యొక్క మొట్టమొదటి మిశ్రమ వైకల్యం పాఠశాలను ప్రారంభించాడు.[3][4]
మూలాలు
మార్చు- ↑ 10TV (25 January 2020). "రిపబ్లిక్ డే సందర్భంగా పద్మశ్రీ అవార్డు గ్రహీతలను ప్రకటించిన కేంద్రం" (in telugu). Archived from the original on 9 November 2021. Retrieved 9 November 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Daily Excelsior (8 November 2021). "Baig, Nirmohi, Landol among 5 from J&K, Ladakh get Padma awards". Archived from the original on 9 November 2021. Retrieved 9 November 2021.
- ↑ NDTV (21 November 2015). "Struck by Terror, This 39-Year-Old Kashmir Teacher is Now Spreading Hope". Archived from the original on 2019-09-15. Retrieved 9 November 2021.