భారతదేశం వీరమాతలకు పేరెన్నికగన్నది. అటువంటివారిలో ఛత్రపతి శివాజీ మాతృమూర్తి , వీరమాత జిజియాబాయి అగ్రగణ్యులు. మరాఠా యోధుల కుటుంబంలో జన్మించిన ఆమె హిందూ ధర్మ పరిరక్షణకు , హిందు స్వరాజ్య స్థాపనకు యువ శివాజీని ప్రోత్సహించి, ఆ విధంగా 200 సంవత్సరాలపాటు వెలుగొందిన మరాఠా సామ్రాజ్యానికి రాజమాత అయ్యారు.

జిజియాబాయి
జిజియాబాయి, కొడుకు శివాజీతో ఉన్న విగ్రహం
జననం(1598-01-12)1598 జనవరి 12
సింద్ ఖేడ్ రాజా, బుల్ధానా జిల్లా
మరణం1674 జూన్ 17(1674-06-17) (వయసు 76)
జీవిత భాగస్వామిషాహాజీ భోఁసలే
పిల్లలుశివాజీ
శంభాజీ - ఈమె మనవడి పేరు కూడా శంభాజీనే‌(శివాజీ కొడుకు)

బాల్యం, వివాహం మార్చు

జిజియాబాయి 1598వ సంవత్సరం నేటి మహారాష్ట్రలోని బుల్ధాన జిల్లాలోని సింద్ ఖేడ్ ప్రాంతంలో జన్మించారు. వారి తండ్రి లఖోజీరావ్ జాధవ్ గోల్కొండ నిజాంషాహి పాలకులవద్ద ముఖ్య పదవిలో ఉండేవారు. జిజియాబాయి భర్త షాహాజీ భోంస్లే బీజాపూర్ సుల్తానుల వద్ద జాగీర్దారుగా పనిచేసేవారు. ఆయన మరాఠాలను,హిందువులను ఏకతాటిపైకి తెచ్చి హిందూ రాజ్య స్థాపన చేయాలని భావించేవారు. ఆ ఆశయం జిజియాబాయికి కూడా ఉండేది. ఆమెకు ఇద్దరు కుమారులు శంభాజీ , శివాజీ. షాహాజీ భోంస్లే తుకాబాయిని రెండవ వివహం చేసుకుని శంభాజీతో బీజాపూర్ సుల్తానుల ఆదేశం మేరకు కర్ణాటక ప్రాంతంలో ఉన్నప్పుడు ఎంతో ఆత్మస్థైర్యంతో శివాజీని పెంచి పెద్దచేశారు.

స్వరాజ్య స్థాపన మార్చు

రామాయణ, మహాభారతాలు, పురాణేతిహాసాలలోని వీరగాథలను శివాజీకి చెప్తూ హిందూ స్వరాజ్య స్థాపన అను కర్తవ్యబోధన చేసేవారు. దాదాజీ కొండదేవ్ ను శిక్షకునిగా నియమించి శివాజీకి అన్ని యుద్దవిద్యలు నేర్పించారు. జిజియామాత ఇచ్చిన స్ఫూర్తితో యువ శివాజీ హిందూ స్వరాజ్య స్థాపన ప్రతినపూనారు. పాలనవిషయాలలో కూడా జిజియాబాయి శివాజీకి అనేక సూచనలు చేసేవారు. శివాజీ మొఘల్ ప్రభువు ఔరంగజేబ్ చెరలో ఉన్నప్పుడు మరాఠా సర్దార్లకు ధైర్యం చెప్తూ మరాఠా రాజ్యపాలనను చూసుకున్నారు. 1674వ సంవత్సరం శివాజీ చత్రపతిగా రాయగడ్ లో పట్టాభిషిక్తుడైన 12రోజులకు తన 76వ ఏట పరమపదించారు.

గుర్తింపు మార్చు

జిజియాబాయి మాతృమూర్తులందరికీ ఆదర్శప్రాయురాలు. వీరి పేరున భారత ప్రభుత్వం స్త్రీ శక్తి పురస్కారం ఏర్పరిచింది.

"https://te.wikipedia.org/w/index.php?title=జిజాబాయి&oldid=3506224" నుండి వెలికితీశారు