జిన్నా టవర్ (ఆంగ్లం:Jinnah Tower) (ఉర్దూ:جناح_مینار) గుంటూరు నగరంలో ఉన్న చారిత్రాత్మక కట్టడం. దీనికి పాకిస్తాన్ జాతిపిత ఐన మహమ్మద్ అలీ జిన్నా పేరు పెట్టడం జరిగింది. ఈ కట్టడం గుంటూరు నగరంలోని మహాత్మా గాంధీ వీధిలో ఉంది. ఇది శాంతి, సామరస్యాలకు చిహ్నం.[1]

జిన్నా టవర్
ప్రదేశంగుంటూరు
భౌగోళికాంశాలు16°17′36.5″N 80°26′51″E / 16.293472°N 80.44750°E / 16.293472; 80.44750
విస్తీర్ణంఆంధ్రప్రదేశ్, భారతదేశం

చరిత్ర మార్చు

ఈ కట్టడం యొక్క మూలం రెండు కథలుగా ప్రచారం జరుగుతుంది. మొదటిది, జిన్నా యొక్క ప్రతినిధి గుంటూరు నగరానికి వచినప్పుడు, ఆ సందర్భానికి చిహ్నంగా లాల్ జాన్ భాషా ఈ టవర్ ని కట్టించి జిన్నాని గౌరవించారని. రెండోది, గుంటూరు మున్సిపల్ చైర్మన్లుగా పనిచేసిన నడింపల్లి వెంకటలక్ష్మీనరసింహారావు, తెల్లాకుల జాలయ్య వారి వారి పదవీకాలంలో శాంతి సామరస్యాలకు చిహ్నంగా దీనిని కట్టించారు అని.

నిర్మాణం మార్చు

ఇది ఆరు స్తంబాల మీద నిలబడి, పైన గుమ్మటపు కప్పు (డోమ్) ఉన్న కట్టడం.. ఇది 12వ శతాబ్దానికి చెందిన ముస్లిం నిర్మాణ శైలిలో ఉంటుంది.[2]

స్థితి మార్చు

2011 వార్తల ప్రకారం ఈ కట్టడం నిర్లక్ష్యానికి గురి అయ్యి అధ్వాన స్థితిలో ఉంది.[3]

మూలాలు మార్చు

  1. Ajay Mankotia (20 May 2015). "Finding Kamala Nehru in Pakistan, Jinnah in Guntur". NDTV.com.
  2. "The Hindu : Tower of harmony in Guntur". The Hindu. 2003-09-07. Archived from the original on 2003-10-27. Retrieved 2016-06-13.
  3. Staff Reporter (2011-03-19). "Jinnah Tower in a state of neglect". The Hindu.