జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు (Zilla Parishath High School) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమైన ప్రభుత్వ రంగ పాఠశాలలు. మూడెంచెల పంచాయితీ రాజ్ వ్యవస్థలో పెద్దదైన జిల్లా ప్రభుత్వాల (ప్రస్తుతం జిల్లా పరిషత్ (ఒకప్పుడు జిల్లా ప్రజా పరిష‌త్‌గా పిలువబడేవి) ) ఆధ్వర్యంలో ఈ పాఠశాలలు నడుస్తాయి. ఆంధ్ర ప్రదేశ్‌లోని దాదాపు అన్ని ముఖ్య గ్రామాల్లో ఉండే ఈ పాఠశాలలు ప్రభుత్వ రంగంలో నాణ్యమైన విద్యను అందిస్తున్నాయి. ఈ ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వందలాది మంది విద్యార్థినీ, విద్యార్థులు ఇప్పుడు అనేక ఉన్నత స్థాయిలలో ఉన్నారు.

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒక గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (రేమల్లి)

ప్రస్తుతం కార్పోరేట్ స్థాయి విద్యా సంస్థలు అందిస్తున్న నాణ్యమైన విద్యను ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఈ పాఠశాలలే అందించాయి. ఒక్కో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలా చుట్టు పక్కల పది పదిహేను గ్రామాల విద్యార్థులకు విద్యనందించేది.

ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణ ప్రాంతాలలో మునిసిపల్ ఉన్నత పాఠశాల‌లు కూడా ఈ తరహాకు చెందిన పాఠశాలలే. ఇవికాక మండల పరిషత్‌ల ఆధ్వర్యంలో మండల ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు కూడా ప్రైమరీ, అప్పర్ ప్రమైరీ విద్యను అందిస్తున్నాయి. వీటికి అదనంగా గురుకుల పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు, కస్తూర్బా పాఠశాలలు కూడా ప్రభుత్వ రంగంలో విద్యను అందిస్తున్నాయి. వీటికి అదనంగా వివిధ సంస్థలు లేదా వ్యక్తలు చేత ప్రారంభింపబడి, ప్రభుత్వ మద్ధతుతో నడుస్తున్న ఎయిడెడ్ విద్యా సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్‌లో విద్యను అందిస్తున్నాయి.

ప్రధానంగా గ్రామీణ ఆంధ్ర ప్రదేశ్‌లో ఉన్నత విద్యకు జెడ్పీ ఉన్నత పాఠశాలలు చేసిన కృషి అమోఘం అనడంలో ఎటువంటి అతిశయోక్తీ లేదు.

మూలాలు

మార్చు

వెలుపలి లంకెలు

మార్చు