జిల్లా పరిషత్ చైర్మన్
జిల్లా ప్రజాపరిషత్తుకు నాయకత్వం వహించేది జిల్లా పరిషత్ ఛైర్మన్. జిల్లా ప్రజాపరిషత్తుకు నేరుగా ఎన్నుకోబడిన సభ్యులు తమ నాయకుని ఎన్నుకుంటారు. ఆధిక్యంతో ఆమోదించిన తీర్మానాలను జిల్లాపరిషత్ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి (సిఇఒ) ద్వారా ఛైర్మన్ అమలు పరుస్తారు.[1]
అధికారాలు
మార్చు- జిల్లా పరిషత్ సమావేశాలకు అధ్యక్షత,విధాన నిర్ణాయక ఓటు
- ముఖ్య కార్యనిర్వాహణ అధికారి (సిఇఒ) పై అజమాయిషీ
- అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణకు, జిల్లాగ్రామీణాభివృద్ధి సంస్థకు, పేదరిక నిర్మూలన సంస్థకు, ఖాదీ, గ్రామీణ పరిశ్రమల బోర్డు, జిల్లా స్థాయి కమీటీ ఛైర్మన్ గా వుంటారు.
- జిల్లా ఆహార కమిటీ సభ్యత్వం
- జిల్లా విద్యా కమిటీ ఛైర్మన్
- ఉపాధ్యాయ బదిలీల కౌన్సెలింగ్ కమిటీ ఛైర్మన్
- జిల్లా క్రీడల అధారిటీ ఛైర్మన్
- జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్ కు విధులు కేటాయింపు
- జిల్లాలో జరుగు అన్నికార్యక్రమాలకు ఆహ్వానితులు
విధులు
మార్చు- ఆధిక్యంతో ఆమోదించిన తీర్మాలను జిల్లాపరిషత్ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి(CEO) ద్వారా ఛైర్మన్ అమలు పరచుట
- జిల్లా పరిషత్ నిధులు, ప్రభుత్వ నిధులతో చేపట్టు పనులు అమలు, పర్యవేక్షణ
- సాంఘిక సంక్షేమ వసతిగృహాల మెరుగుదలకు సూచనలు చేయుట
- జిల్లా ఉపాధి, శిక్షణ శాఖ శిక్షణ సంస్థల మెరుగుదలకు సూచనలు చేయుట
- రాష్ట్ర సహాయ మంత్రి హోదా.
- జిల్లా అభివృద్ధిశాఖల పనితీరు సమీక్ష, సూచనలు చేయుట
మూలాలు
మార్చు- ↑ GO MS no: 756 Panchayatiraj date:1994-11-30
వనరులు
మార్చు- జిల్లాపరిషత్ కరదీపిక (PDF). Archived from the original (PDF) on 2014-03-27.
- "గుంటూరు జిల్లా పరిషత్ వెబ్సైట్". Archived from the original on 2021-02-03. Retrieved 2021-01-30.