జిహోలార్నిస్ (Jeholornis) రెండు తోకలు కలిగి ఉండే పక్షి. ఇవి దాదాపు 120 మిలియన్ సంవత్సరాల క్రితం జీవించి ఉండేవి. ప్రస్తుతము అంతరించిపోయాయి. ఇది బతికింది కోటానుకోట్ల ఏళ్ల క్రితం. డైనోసార్లు ఈ భూమిపై తిరగాడిన కాలంలో. అయితే ఈ వింత పక్షి శిలాజాలను బట్టి కంప్యూటర్లలో దీన్ని రూపు గీస్తే దీని గురించి బోలెడు వింత నిజాలు బయటపడ్డాయి.

Restoration
Size comparison

విశేశాలు మార్చు

  • ఈ పక్షి ఎప్పుడో 120 మిలియన్ సంవత్సరాల క్రితం అంటే సుమారు 12 కోట్ల ఏళ్ల క్రితం చైనా భూభాగంలో జీవించేది.
  • నలుపు రంగులో ఉండే పొడవైన దేహం, తలపై ఎర్రటి కిరీటం లాంటి భాగం... దీనికి తోడు రెండు తోకలతో ఉండే ఈ వింత పక్షి మనం చూసే కోడంత పరిమాణంలో ఉండేది.
  • దీని మరో ప్రత్యేకత ... కాళ్ల గోళ్లతోపాటు రెక్కలకు కూడా పదునైన గోళ్లుండేవి.
  • ఈ పక్షి శిలాజాలు కొన్ని దశాబ్దాల క్రితమే దొరికాయి. అప్పుడు దీనిపై పరిశోధనలు మొదలెట్టారు. మొదట్లో ఈ పక్షికి ఒకే పేద్ద తోక ఉందని, అది అలంకరణ కోసం మాత్రమే ఉన్నట్టు భావించారు. కానీ అత్యాధునిక పరికరాలతో చేసిన పరిశీలనల్లో దీని శిలాజాల ఆధారంగా ఈ పక్షికి రెండు తోకలున్నట్టు కనుగొని, అంతా ఆశ్చర్యపోయారు.
  • వెనక భాగంలో ఉండే దీని రెండు తోకల్లో ఒకటి పొడవుగా ఉండి చివరన ఈకలతో ఉంటుంది. మరోటి చిన్నగా మిగతా పక్షుల తోకల్లానే ఉంటుంది.
  • దీనికున్న ఈ భిన్న లక్షణాలన్నీ ఇవి హాయిగా జీవనం గడపడానికి, ఆహారం సంపాదించుకోవడానికి, శత్రువుల నుంచి కాపాడుకోవడానికి తోడ్పడేవి.
  • రెండు తోకల్లో చిన్నది ఎగరడానికి, పెద్దది ఈ పక్షి అందాన్ని చూపడానికి ఉపయోగపడేది. దీని పొడవాటి తోకపై చిన్నపాటి ఫ్యాన్ రెక్కల్లాంటి ఈకలు ఉండేవి. ఇవీ ఆకర్షణకే పనికొచ్చేవి.

బయటి లంకెలు మార్చు