జి.డి. యాదవ్
జి.డి. యాదవ్ (జననం: సెప్టెంబరు 14, 1952) ఈయన భారతీయ రసాయన ఇంజనీర్, శాస్త్రవేత్త, విద్యావేత్త. ఈయన సూక్ష్మ పదార్ధాలపై పరిశోధన, రసాయన ప్రతిచర్యతో గ్యాస్ శోషణ ఉత్ప్రేరకాలపై పరిశోధనలు చేసాడు. ఈయన పద్మశ్రీ పురస్కార గ్రహీత.[1]
జి.డి. యాదవ్ | |
---|---|
జననం | అర్జున్వాడ, రాధనాగరి, కొల్లాపూర్ జిల్లా, మహారాష్ట్ర, భారతదేశం | 1952 సెప్టెంబరు 14
ఇతర పేర్లు | యోగేష్ |
వృత్తి | రసాయన ఇంజనీర్, శాస్త్రవేత్త, విద్యావేత్త. |
క్రియాశీల సంవత్సరాలు | Since 1976 |
జీవిత భాగస్వామి | వసంతి వీరరాఘవన్ అయ్యర్ |
పిల్లలు | ఇద్దరు కుమారులు |
తల్లిదండ్రులు | దాదాసాహెబ్ కృష్ణజీ యాదవ్ రుక్మ్ని |
పురస్కారాలు | పద్మశ్రీ పురస్కారం |
తొలినాళ్ళ జీవితం
మార్చుఈయన 1952, సెప్టెంబరు 14 న దాదాసాహెబ్ కృష్ణాజీ-రుక్మిణి దంపతులకు మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలోని రాధనగరి తహసీల్ లోని అర్జున్వాడ అనే చిన్న గ్రామంలో జన్మించాడు. ఈయన తన ప్రాథమిక విద్యను తన గ్రామంలోని స్థానిక పాఠశాలలో VII తరగతి వరకు తరువాత కొల్లాపూర్ లో పదవ తరగతి వరకు చదివాడు. ఈయన 1970 లో ముంబై విశ్వవిద్యాలయంలో యూనివర్శిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (యుడిసిటి) లో కెమికల్ ఇంజనీరింగ్ విభాగంలో తన ఇంజనీరింగ్ విద్యను పూర్తిచేసాడు. తన విద్య అనంతరం ఇదే విశ్వవిద్యాలయంలో ఫ్యాకల్టీ సభ్యునిగా తన వృత్తిని ప్రారంభించాడు. ఈయన 1980 లో తన పిహెచ్‌డిని కెమికల్ ఇంజనీర్ మన్ మోహన్ శర్మ పర్యవేక్షణలో అధ్యయనాలను కొనసాగించాడు. యు.కె లోని లౌబరో యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీలో లెవర్‌హూల్మ్ ఫెలో (1980–81), యూనివర్శిటీ ఆఫ్ యూనివర్శిటీలో పనిచేశాడు. ఈయన అంటారియో యాస్ నేచురల్ సైన్సెస్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ కౌన్సిల్ ఫెలో (1982–86), జోహన్సేన్ క్రాస్బీ విజిటింగ్ చైర్ ప్రొఫెసర్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్, మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీ (2001–02), విశిష్ట విజిటింగ్ స్కాలర్, ఆసియా ఇనిషియేటివ్ ఆఫ్ పర్డ్యూ యూనివర్శిటీ ప్రెసిడెంట్ (2007), విజిటింగ్ ప్రొఫెసర్ లుంగ్వా యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, తైవాన్, దర్బారీ సేథ్ అకర్బన కెమికల్ టెక్నాలజీ ప్రొఫెసర్ (1996-2009), డిపార్ట్మెంట్ హెడ్, కెమికల్ ఇంజనీరింగ్ (2006-09), డైరెక్టర్, ఆర్టి మోడి విశిష్ట ప్రొఫెసర్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీకి సిట్టింగ్ వైస్ ఛాన్సలర్ గా పనిచేశాడు.[2]
వ్యక్తిగత జీవితం
మార్చుఈయన వసంత వీరరాఘవన్ అయ్యర్‌ను వివాహం చేసుకున్నాడు, ఈ దంపతులకు విక్రమాదిత్య, గౌతమ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.
పురస్కారాలు
మార్చుఎడవళత్ కక్కాడ్ జానకీ అమ్మాళ్ ఒక భారతీయ మహిళా శాస్త్రవేత్త. ఈవిడ వృక్షశాస్త్రంలో చాలా కృషి చేశారు. వృక్షశాస్త్ర శాఖలో సైటోజెనెటిక్స్ (అంటే జీవకణ నిర్మాణం, విధులకు సంబంధించిన శాస్త్రం), భూగోళ శాస్త్రంపై పరిశోధన జరిపార.ఈమె చెరకు, వంగ చెట్టు మీద చాలా పేరెన్నికైన పరిశోధన జరిపారు. అలాగే జానకీ అమ్మాళ్, కేరళ వర్షాధార అడవుల నుండి ఔషధపరంగా, వాణిజ్యపరంగా పలు విలువైన మొక్కలు సేకరించారు.
- ఈయనకు 1994 లో ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ టెక్నాలజీ ఇన్ ఎడ్యుకేషన్ (ISTE) సంస్థ వారి ఉత్తమ ఇంజనీరింగ్ కాలేజీ టీచర్ పురస్కారం,
- 1995 లో వాస్విక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ పురస్కారం,
- 1997 లో పర్యావరణ అనుకూల సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధికి ఐ.ఐ.ఈ.ఈ పురస్కారం,
- 2002 లో బరోడా మహారాజా సయాజిరావ్ విశ్వవిద్యాలయం యొక్క కెజి నాయక్ బంగారు పతాకం, 2005 లో అత్యుత్తమ విద్యావేత్తగా అన్నా విశ్వవిద్యాలయం జాతీయ అవార్డును అందుకున్నారు.
- 2011 లో సివి రామన్ పురస్కారం, పారిశ్రామిక గ్రీన్ కెమిస్ట్రీ వరల్డ్ యొక్క గ్రీన్ కెమిస్ట్రీ పురస్కారాన్ని అందుకున్నాడు. ఈయనకు ఇండియన్ కెమికల్ కౌన్సిల్
- 2013 లో డిఎం త్రివేది లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ పురస్కారాన్ని అందుకున్నాడు. ఈయన 2015లో 15 వ ఎన్‌ఇఎస్ జగద్గురు శంకరాచార్య జాతీయ శాస్త్రవేత్త పురస్కారాన్ని అందుకున్నాడు.
- 1994 లో హిందూస్తాన్ లివర్ బియెనియల్ వారి కెమికల్ ఇంజనీర్ ఆఫ్ ది ఇయర్, 2006 లో కె. అంజి రెడ్డి ఇన్నోవేటర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం.
మూలాలు
మార్చు- ↑ "Kolhapur connection for Padmashri awardee". Times of India. 30 January 2016. Retrieved 27 December 2019.
- ↑ "Vice Chancellor and R.T. Mody Distinguished Professor". Institute of Chemical Technology. 2016. Archived from the original on 27 డిసెంబరు 2019. Retrieved 27 December 2019.
- ↑ "Maharashtra shines with 16 Padma honours, awardees elated". Times of India. 26 January 2016. Retrieved 27 December 2019.