గుల్ల సూర్యప్రకాశ్

(జి.సూర్యప్రకాశ్ నుండి దారిమార్పు చెందింది)

డాక్టర్ జి.సూర్యప్రకాశ్ ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ప్రముఖ గుండె వైద్య నిపుణులు. వీరు సికింద్రాబాదు లోని కేర్ ఆసుపత్రి మెడికల్ డైరెక్టరు గా తన వైద్య సేవలందిస్తున్నారు.

గుల్ల సూర్యప్రకాశ్
జననంగుల్ల సూర్యప్రకాశ్
India ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లాలోని రావిపల్లి గ్రామం.
వృత్తిగుండె వైద్య నిపుణులు
ప్రసిద్ధిగుండె వైద్య నిపుణులు
గుల్ల సూర్యప్రకాశ్

వీరి జన్మస్థలం విజయనగరం జిల్లాలోని రావిపల్లి గ్రామం.

ప్రాథమిక విద్యాభ్యాసం తరువాత, వీరు విశాఖపట్నంలోని ఆంధ్ర వైద్య కళాశాలలో 1984లో వైద్య విద్య నభ్యసించారు. విద్యార్ధిగానే వీరు బంగారు పతకాలు సాధించారు. తరువాత జాతీయ స్థాయిలో మంచి రాంకు సాధించి అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థలో చేరి M.D. పూర్తిచేశారు. తరువాత నిజాం వైద్య విజ్ఞాన సంస్థలో D.M (Cardiology) 1994లో పూర్తిచేశారు. వీరు 100 పైగా శాస్త్రీయ పరిశోధనా పత్రాలను వివిధ పత్రికలలో ప్రచురించారు. అమెరికా, యూరప్ దేశాలు విస్తృతంగా పర్యటించి విశేష అనుభవం గడించారు. 2015లో అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వైద్యరత్న పురస్కారంతో సత్కరించింది.