జి. ఎం. సి. బాలయోగి క్రీడాస్థలము

జి. ఎం. సి. బాలయోగి క్రీడాస్థలము (English: G. M. C. Balayogi Athletic Stadium) భారతదేశం లోణి తెలంగాణ రాష్ట్ర ముఖ్య పట్టణమైన హైదరాబాదు లోని క్రీడా స్టేడియం. దీని సామర్థ్యం 30,000 మంది వీక్షకులకు అందుబాటులో ఉంటుంది.[1]

G. M. C. Balayogi Athletic Stadium
జి. ఎం. సి. బాలయోగి క్రీడాస్థలము
లాల్ బహాదూర్ స్టేడియం
Locationహైదరాబాదు తెలంగాణ
OwnerSports Authority of Telangana
Surfaceగడ్డి

క్రీడాస్థలము

మార్చు

ఇది ఒక అధునాతన క్రీడాస్థలము. ఇందులో 8 వరుసల సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ ఉంటుంది. ఇందులో 4 వరుసల సింథటిక్ ప్రాక్టీసు ట్రాక్ ఉంటుంది. దీని ఉపయోగం రాత్రి పగలు జరిగే క్రీడలకు నవీన కాంతులను వెదజల్లడమే. ఈ స్టేడియం పేరును హెలీకాప్టర్ ప్రమాదంలో మరణించిన మాజీ లోక్ సభ స్పీకరు జి.ఎం.సి.బాలయోగి జ్ఞాపకార్థం పెట్టబడింది.

2003 ఆఫ్రో ఆసియన్ క్రీడలు ఈ స్టేడియంలోనే జరిగాయి. ఈ క్రీడల ప్రారంభ వేడుకలను సుమారు 30,000 మంది ప్రజలు వీక్షించారు. ఈ ప్రారంభ వేడుకలు సుమారు 2 గంటల 40 నిమిషా ల అధ్బుతమైన లేసర్ షోతో కూడుకొని జరిగినవి.

17°26′46″N 78°20′39″E / 17.446241°N 78.344214°E / 17.446241; 78.344214

2010 డిసెంబరు 26 న 2800 మంది కూచిపూడి నాట్యకారులు గిన్నిస్ బుక్లో స్థానం సంపాదించుటకు విశేషమైన ప్రదర్శనను ఈ స్టేడియం లోనే నిర్వహించారు.[2]

తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఈ స్టేడియం పేరును భాగ్యరెడ్డి వర్మ క్రీడామైదానముగా నామకరణం చేశారు.

మూలాలు

మార్చు
  1. "www.worldstadiums.com". Archived from the original on 2011-09-24. Retrieved 2014-10-09.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-10-17. Retrieved 2014-10-09.