జి. కె. మూపనార్ (గోవిందస్వామి కరుప్పయ్య మూపనార్)19 ఆగస్టు 1931 తమిళనాడు లోని కబిస్థలమ్ , తంజావూర్ జిల్లా లో జన్మించారు .

రాజకీయ జీవితం

మార్చు
 
జి.కె మూపనార్

జి.కె .మూపనార్ కాంగ్రెస్ వాది .1951 కుంబకోణం లో మూపనార్ అప్పటి కాంగ్రెస్ నాయకులైన కామరాజ్,జయప్రకాష్ నారాయణ్‌లను కలిశారు. అపుడు కామరాజ్ తమిళనాడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఉన్నాడు. మూపనార్ 1965 లో తంజావూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడయ్యాడు.1969 లో కాంగ్రెస్ చీలిక లో మూపనార్ కామరాజ్ వర్గం లో వున్నారు. 1975 అక్టోబర్ 2 న కామరాజ్ మరణించిన తరువాత, తమిళనాడులోని రెండు కాంగ్రెస్ వర్గాలు 1976 లో విలీనం అయ్యాయి[1]. తన రాజకీయ జీవితం లో క్రమేణా కాంగ్రెస్ పార్టీ లో ఉన్నత స్థాయి నాయకుడిగా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలను సరిదిద్దడం లో ప్రధాన పాత్రను పోషించాడు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గా 1980-1988 మధ్య కాలం లో పనిచేశారు . రాజ్యసభ్యుడి గా తమిళనాడు నుంచి ఎన్నిక అయినారు . తమిళనాడు లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం కామరాజ్ పరిపాలన తిరిగి తీసుకు రావాలనే కల గానే తన జీవితం లో మిగిలిందని ఆవేదనతో మూపనార్ చివరి దశ లో అనే వారు [2]. 1996 లోక్ సభ ఎన్నకల తర్వాత ఒక దశలో మూపనార్ ను ప్రధానమంత్రి అవుతాడని ప్రచారం జరిగింది . కానీ అది రాజకీయ కారణాలతో మూపనార్ ఆ పదవిని చేపట్టలేక పోయాడు.[3]

జి.కె .మూపనార్ 30 ఆగష్టు 2001 చెన్నయ్ లో మరణించాడు.[4]

మూలాలు

మార్చు
  1. PeoplePill. "G. K. Moopanar: Indian politician (1931 - 2001) | Biography, Facts, Career, Wiki, Life". PeoplePill (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-07-23.
  2. Palanithurai, G. (2010). Remembering G.K. Moopanar (in ఇంగ్లీష్). Concept Publishing Company. ISBN 978-81-8069-678-7.
  3. Pioneer, The. "How a Tamil failed to become PM". The Pioneer (in ఇంగ్లీష్). Retrieved 2021-01-27.
  4. "G K Moopanar is dead". timesofindia.indiatimes.com/. 2021-01-27. Retrieved 2021-01-27.{{cite web}}: CS1 maint: url-status (link)