జీఎస్‌ఎల్‌వి-ఎఫ్11

జీఎస్‌ఎల్‌వి-ఎఫ్11 అనునది ఇస్రోరూపొందించిన ఉపగ్రహ వాహక నౌక. ఈ నౌక ద్వారా ఉపగ్రహాలను భూస్థిర కక్ష్యలో ప్రవేశ పెట్టవచ్చును. జీఎస్‌ఎల్‌వి వాహక నౌకలు మూడు అంచెలు/దశలు కల్గి వున్న ఉపగ్రహ వాహక నౌక తరగతికి చెందినవి.

ఉపగ్రహ ప్రయోగ సన్నహాలు మార్చు

వాహక నౌక ప్రయోగ కౌంట్ డౌన్ ను ఇస్రో చైర్మెన్ శివన్ మంగళ వారం మధ్యహాన్నం లాంచనంగా ఆంధ్ర ప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో వున్నశ్రీహరికోటలోని సతీష్ థావన్ అంతరిక్ష కేంద్రంలో ప్రాంరంభించారు. కౌంట్ డౌన్ మధ్యాహ్నం 2:10 గంటలకు మొదలైనది. కౌంట్ డౌన్ 26 గంటలు కొనసాగింది.[1]

ఉపగ్రహ వివరాలు మార్చు

ఉపగ్రహం జీశాట్ -7ఏ అనునది సమాచార ఉపగ్రహం. సాధారణంగా సమాచార ఉపగ్రహాలు డిటిఎచ్ ప్రసారాలు, ఇంటర్నెట్ ప్రసారలను పెంపెందించేతందుకు ఉపయోగిస్తారు. కాని జీశాట్ -7ఏ ఉపగ్రహం మాత్రం అడ్వాన్స్‌డ్ మిలిటరి కమ్యూనికేషన్/సమాచార ఉపగ్రహంగా పని చేస్తుందని ఇస్రో చెప్పినది. ఉపగ్రహం బరువు 2250 కిలోలు.[2]

మూలాలు మార్చు

  1. "Isro begins countdown for GSLV-F11/GSAT-7A mission". timesofindia. Archived from the original on 2018-12-18. Retrieved 2018-12-19.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "GSAT-7A: Isro to launch communication satellite today". indiatoday.in. Retrieved 2018-12-19.