జీడిమెట్ల చెరువు

జీడిమెట్ల చెరువు హైదరాబాదు నగరంలో ఐదవ పెద్దచెరువు. దీనిని నక్కసాగర్ చెరువు, కొల్లచెరువు అనికూడా పిలుస్తారు. రెండు కిలోమీటర్లకు పొడవు వెడల్పుతో ఉండే ఈ చెరువు కొంపల్లికి సమీపంలోని జీడీమెట్లలో ఉంది.[3] ఇది చేపల వేట, పిక్నిక్‌లకు అనువైన చెరువు.[4][1]

జీడిమెట్ల చెరువు
ప్రదేశంహైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
అక్షాంశ,రేఖాంశాలు17°31′26″N 78°28′12″E / 17.524°N 78.470°E / 17.524; 78.470
రకంజలాశయం
సరస్సులోకి ప్రవాహంమూసీనది
వెలుపలికి ప్రవాహంమూసీనది
ప్రవహించే దేశాలుభారతదేశం
ఉపరితల వైశాల్యం2 km2 (0.77 sq mi)[1]
సరాసరి లోతు33 అడుగులు (10 మీటర్లు)[2]

చరిత్ర మార్చు

1897లో నిజాం నవాబులు (మహబూబ్ అలీ ఖాన్) హైదరాబాద్ నగరానికి నీటి వనరులను మెరుగుపర్చడానికి 31 చెరువులలో నిర్మించగా, అందులో ఒకటి ఈ జీడిమెట్ల చెరువు. దీనిని ఫాక్స్ సాగర్ మీద ఒక ఆనకట్టగా నిర్మించారు. నిజాం కాలంలో సమీప గ్రామాలకు తాగునీటిని, సాగునీటిని అందించింది.

మూసినదిలో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిర్మాణానికి ముందు ఈ సరస్సు నిర్మించబడింది. ఈ సరస్సు ఒకప్పుడు హుస్సేన్ సాగర్‌తో మూసినది ఉపనది ద్వారా అనుసంధానించబడింది.

ఇతర వివరాలు మార్చు

  1. ఇది ఒకప్పుడు 290 ఎకరాల (1.2 చకిమీ) విస్తీర్ణంలో విస్తరించి ఉండేది. 2014 నాటికి, ఆక్రమణ కారణంగా, ఇది 126 ఎకరాల (0.51 చకిమీ) వైశాల్యం మాత్రమే మిగిలింది.[5]
  2. చెరువు ఒడ్డున పంప్ హౌస్ గా నిర్మించిన రాతి నిర్మాణం ఇప్పటికీ ఉంది. దీనికిగల ఉక్కు నిర్మాణాలు తుప్పు పట్టాయి.
  3. ఈ చెరువును శుభ్రపరచడానికి ప్రభుత్వ సంస్థలు, వాలంటీర్లు కొన్ని ప్రయత్నాలు ప్రారంభించారు.[6]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 M. L., Maitreyi Mellu (2017-11-11). "Efforts to restore Fox Sagar". The Hindu. Hyderabad. Retrieved 2021-03-19.
  2. "Two more spells of rain will lift Osman Sagar, Himayat Sagar gates". The New Indian Express. Hyderabad. 2017-10-12. Retrieved 2021-03-19.
  3. Syed, Akbar (2017-09-20). "E120-yr-old Fox Sagar now dump for toxic chemicals". Times of India. Hyderabad. Retrieved 2021-03-19.
  4. నమస్తే తెలంగాణ, అల్వాల్ చెరువు (15 October 2017). "నగరంలో చెరువులు.. పర్యాటక నెలవులు". Retrieved 2021-03-19.
  5. C, Sarala; B, Venkateswara Rao (2014-11-01). HYDROLOGY AND WATERSHED MANAGEMENT. institute of Science & Technology, JNTU. ISBN 9788184249521. Retrieved 2021-03-19.
  6. "Rejuvenating Fox Sagar lake". The Hindu. Hyderabad. 2017-02-08. Retrieved 2021-03-19.