జీరా ఆలూ [1] తెలుగు వారు ఇష్టపడే కూరగాయల్లో బంగాళాదుంప (ఆలూ) ఒకటి. ఆహార ప్రియులు ఆలూ ఫ్రై చేసి అన్నంతో కాకుండా నేరుగా తినేస్తూంటారు.[2] [3]

కావలసినవి మార్చు

  1. బంగాళాదుంపలు -4
  2. నూనె-రెండు టేబుల్ స్పూన్లు
  3. నెయ్యి-రెండు టేబుల్ స్పూన్లు
  4. అల్లం తరుగు -టేబుల్ స్పూను
  5. పచ్చి మిర్చి -2
  6. ఇంగువ-చిటికెడు
  7. ఉప్పు-తగినంత
  8. కసూరీమేథీ-చెంచా
  9. కొత్తిమీర తరుగు -పావు కప్పు
  10. జీలకర్ర -ఒకటింపావు చెంచా
  11. పసుపు- పావు చెంచా
  12. కారం-చెంచా
  13. జీలకర్రపొడి-చెంచా
  14. దనియాలపొడి-టేబుల్ స్పూను

తయారీ విధానం మార్చు

  1. ముందుగా బంగాళాదుంపల్ని కుక్కర్ లో వేసుకుని మూడు కూతలు వచ్చేవరకూ ఉడికించుకుని ఆ తరువాత చెక్కు తీసి పెద్ద ముక్కల్లా కోసి పెట్టుకోవాలి.
  2. స్టవ్ మీద కడాయిని పెట్టి నూనె, నెయ్యి వేయాలి.
  3. నెయ్యి వేడెక్కాక జీలకర్ర వేసి వేయించాలి. తరువాత అల్లం తరుగు, సన్నగా కోసిన పచ్చిమిర్చి, ఇంగువ, పసుపు, కారం, జీలకర్రపొడి, దనియాలపొడి, తగినంత ఉప్పు, కసూరీమేథీ వేసి బాగా కలపాలి.
  4. రెండు నిమిషాలయ్యాక బంగాళాదుంపలు వేసి మరోసారి కలపాలి.
  5. ఆలూ ముక్కలు వేగాయనుకున్నాక కొత్తిమీర తరుగు చల్లి స్టవ్ ని కట్టేయాలి

మూలాలు మార్చు

  1. "Aloo Jeera". NDTV Food (in ఇంగ్లీష్). Retrieved 2024-05-12.
  2. ఈనాడు ఆదివారం (2024-05-12), ఆలూ.. అదిరిపోయేలా!, retrieved 2024-05-12
  3. Ghose, Sandip (2023-11-18). "In praise of potatoes: People may come and people may go, but the Aloo will go on forever". The New Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2024-05-12.
"https://te.wikipedia.org/w/index.php?title=జీరా_ఆలూ&oldid=4217022" నుండి వెలికితీశారు