జీవనడోలీ మధుర జీవన కేళీ

ఘంటసాల

        ఘంటసాల: జీవన డోలీ! జీవన డోలీ! మధుర జీవన కేళీ
                        ఇదే ప్రేమ సుధా వాహినీ!
        ఇద్దరు: ఓ! ప్రియా తేలుదమే హాయిగా
                        జీవన డోలీ! జీవన డోలీ! మధుర జీవన కేళీ
                        ఇదే ప్రేమ సుధా వాహినీ!
                        ఓ! ప్రియా తేలుదమే హాయిగా
        ఘంటసాల: జీవన డోలి
        భానుమతి: నీవే సరంగువి! ప్రేమ కేళి డోలికి
                        ఆనంద వాహినిలో హాయి సాగి పోవగా
                        ఓ! ప్రియా తేలుదమే హాయిగా జీవన డోలి
        ఘంటసాల: నీవే చుక్కానివిగ నడుపు అదో ప్రేమ నగరి!
                        ఓ!.. చెలీ చేరుదమే హాయిగా జీవన డోలి

        భానుమతి: పున్నమ రేయి! పాల వెన్నెలలో హాయి
                        పోనిమ్మా సరాసరి డోలికా
                        ఓ! మనోహరా! ఓ! మనోహరా!
                        ఓ! ప్రియా తేలుదమే హాయిగా జీవన డోళి
        ఘంటసాల: వలి పూల గాలి సాగే
        భానుమతి: సుమ డోలి ఉయ్యాలూగే
        ఘంటసాల: వలి పూల గాలి సాగే
        భానుమతి: సుమ డోలి ఉయ్యాలూగే
                        చెలీ చంద్రికా! అదే ప్రేమనగరీ
                        ప్రేమసఖా
        ఘంటసాల: ప్రేమ సఖీ
        భానుమతి: ప్రేమ సఖా చేరుదమా
        ఘంటసాల: ప్రేమ సఖీ చేరుదమే
        ఇద్దరు: ఓ ప్రియా! చేరుదమే హాయిగా
                        జీవన డోలీ! జీవన డోలీ! మధుర జీవన కేళీ
                        ఇదే ప్రేమ సుధా వాహినీ!
                        ఓ! ప్రియా తేలుదమే హాయిగా జీవన డోలీ!