జీవవైవిధ్యం
జీవవైవిధ్యం అంటే భూమి మీద ఉన్న వివిధ రకాలైన జీవకోటిలో ఉన్న వైవిధ్యం. దీన్ని వివిధ స్థాయిల్లో కొలవవచ్చు.[1] ఈ వైవిధ్యం భూమి అంతటా సమానంగా విస్తరించలేదు. భూమధ్యరేఖకు సమీపంలోఉన్న ఉష్ణమండల ప్రాంతాల్లో వెచ్చటి వాతావరణం వలన జీవక్రియకు అనుకూలంగా ఉండి జీవవైవిధ్యం హెచ్చుగా ఉంటుంది. ఉష్ణమండల అరణ్యాలు భూమిపైన ఉన్న మట్టిభాగంలో కేవలం ఐదో భాగమే అయినా ప్రపంచపు జీవజాలంలో 50% ఇక్కడ కనిపిస్తాయి.[2]
మానవ కార్యకలాపాలు కూడా ప్రస్తుతం క్షీణిస్తున్న జీవవైవిధ్యానికి కారణం. వ్యవసాయం కోసం జంతువుల ఆవాసాలను ధ్వంసం చేయడం ఒక కారణం. వాతావరణంలో మార్పులు కూడా మరొక కారణం.
2011 లో మోరా, ఇంకా ఇతర పరిశోధకులు చేసిన పరిశోధనల ప్రకారం సుమారు 87 లక్షల భూచర జీవజాతులు, 22 లక్షన జలచర జీవజాతులు ఉన్నాయి. వీటిలో కేంద్రకయుత జీవుల అంచనా చాలా వరకు ఖచ్చితంగా ఉండగా, కేంద్రకపూర్వ జీవుల అంచనా కొంత తక్కువ ఖచ్చితత్వంతో ఉంటుంది.[3] కొన్ని జంతువులు కనుమరుగు అయ్యే రేటు ఎక్కువ కావడం వలన, వాటిని వర్ణించేలోపే అవి ఆంతరించే ప్రమాదం ఉంది.[4] జంతుప్రపంచంలో పక్షులు, క్షీరదాల మీద ఎక్కువగా పరిశోధనలు జరగగా, చేపలు, ఇతర అకశేరుకాల మీద తక్కువ పరిశోధనలు జరిగాయి.[5]
మూలాలు
మార్చు- ↑ Faith, Daniel P. (1992). "Conservation evaluation and phylogenetic diversity". Biological Conservation. 61 (1): 1–10. Bibcode:1992BCons..61....1F. doi:10.1016/0006-3207(92)91201-3.
- ↑ Pillay, Rajeev; Venter, Michelle; Aragon-Osejo, Jose; González-del-Pliego, Pamela; Hansen, Andrew J; Watson, James EM; Venter, Oscar (February 2022). "Tropical forests are home to over half of the world's vertebrate species". Frontiers in Ecology and the Environment. 20 (1): 10–15. Bibcode:2022FrEE...20...10P. doi:10.1002/fee.2420. PMC 9293027. PMID 35873358.
- ↑ Mora, Camilo; Tittensor, Derek P.; Adl, Sina; Simpson, Alastair G. B.; Worm, Boris; Mace, Georgina M. (23 August 2011). "How Many Species Are There on Earth and in the Ocean?". PLOS Biology. 9 (8): e1001127. doi:10.1371/journal.pbio.1001127. PMC 3160336. PMID 21886479.
- ↑ McKie, Robin (25 September 2005). "Discovery of new species and extermination at high rate". The Guardian. London.
- ↑ Bautista, Luis M.; Pantoja, Juan Carlos (2005). "What species should we study next?". Bulletin of the British Ecological Society. 36 (4): 27–28. hdl:10261/43928.