జీవి
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
జీవం (ఆంగ్లం Life) ఉన్న ప్రాణులన్నీ జీవులు (Organisms). సృష్టిలో గల జీవులను గురించిన అధ్యయనాన్ని జీవ శాస్త్రము అంటారు. జీవుల వర్గీకరణ, ఉనికి, ఆవాసం, అలవాట్లు, స్వరూపం, వివిధ అవయవాల నిర్మాణం, అవి చేసే పనులు, ఆవాసంలోని భౌతిక, రసాయనిక, భౌగోళిక, జీవ, నిర్జీవ కారకాలు - వాటి ప్రభావం, జంతువుల ప్రవర్తన మొదలైనవన్నీ జీవ శాస్త్రంలో అంతర్భాగాలు.

Life on Earth Temporal range: Late Hadean - Recent
| |
---|---|
![]() | |
These Escherichia coli cells provide an example of a microorganism | |
Scientific classification | |
(unranked): | Life on Earth (Gaeabionta)
|
Domains and Kingdoms | |
వృద్ధాప్యం - స్పెర్మిడైన్సవరించు
ప్రతి జీవి నిర్ణీత కాలం వరకు బ్రతికి మరణిస్తుంది. శరీరంలోని కణాల క్రమక్షయం వల్లే వయసు పైబడుతుంది. ఈ కణాల అభివృద్ధికి స్పెర్మిడైన్ తోడ్పడుతుంది. శరీరంలోని జీవ కణాలను దెబ్బతీసి వృద్ధాప్యానికి చేరువచేసే 'ఫ్రీ రాడికల్స్' నుంచి కాపాడే 'స్పెర్మిడైన్' అనే మాలిక్యూల్ వయసు పైబడకుండా కాపాడి... ఆయుష్షును పాతికేళ్లదాకా పెంచుతుందని పరిశోధకులు తెలిపారు. ఇతర కణాల కంటే స్పెర్మిడైన్ ప్రభావం పడిన కణాల జీవిత కాలం 4 రెట్లు పెరిగింది. ఈగల జీవిత కాలం 30 శాతం అధికమైంది. ఎలుకలకు సుమారు 200 రోజులపాటు నీరు, ఆహారంతోపాటు స్పెర్మిడైన్ అందించారు. వీటిలో ఫ్రీ రాడికల్స్ 30 శాతం తగ్గినట్లు గుర్తించారు. వెరసి... స్పెర్మిడైన్ ద్వారా వృద్ధాప్యాన్ని దూరం చేసి, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచవచ్చని శాస్త్రవేత్తలు తేల్చారు.
జీవుల వర్గీకరణసవరించు
జీవరాశులను వివిధ రాజ్యాలుగా విభజించడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. వీటన్నింటిలో 'ఐదు రాజ్యాల వర్గీకరణ' (Five Kingdom Classification) ఎక్కువమంది ఆమోదం పొందింది. జీవ పరిణామ రీత్యా జీవులలోని మూడు ప్రాథమికాంశాలను పరిగణలోకి తీసుకొని విట్టకర్, 1969లో దీన్ని ప్రతిపాదించారు. ఇవి కణ నిర్మాణ స్వభావం (కేంద్రకపూర్వం, నిజకేంద్రక కణాలు), దేహనిర్మాణంలో క్లిష్టత (ఏకకణ, బహుకణ), పోషక విధానం (స్వయం పోషణ, పరపోషణ) ప్రధానాంశాలు.
- రాజ్యం 1: మొనీరా (Monera):
- యూబాక్టీరియా: ఉ. కాకై, బాసిల్లై, స్పైరెల్లె
- ఏక్టినోమైసిటిస్: ఉ. ఏక్టినోమైసెస్, కొరెనిబాక్టీరియం, మైకోబాక్టీరియం, స్త్రెప్టోమైసిస్
- ఆర్కి బాక్టీరియా: ఉ. హేలోబాక్టీరియం
- సయనో బాక్టీరియా: ఉ. ఆసిల్లటోరియా, నాస్టాక్
- మైకోప్లాస్మాలు: ఉ. మైకోప్లాస్మా గాలిసెప్టికం
- రాజ్యం 2:ప్రోటిస్టా (Protista)
- స్వయం పోషక ప్రోటిస్ట్ లు. ఉ. శైవలాలు, డయాటమ్ లు, యూగ్లీనాయిడ్ లు
- విచ్ఛేద కారక ప్రోటిస్ట్ లు. ఉ. శిలీంద్ర ప్రోటిస్ట్లు, జిగురు బూజులు
- వినియోగదారులైన ప్రోటోజోవన్ ప్రోటిస్ట్ లు. ఉ. ప్రోటోజోవా
- రాజ్యం 3: శిలీంధ్రాలు (Fungi)
- రాజ్యం 4: ప్లాంటే (ఫ్లాంటె)
- రాజ్యం 5: ఏనిమేలియా (మెటాజోవా)
ఇవి కూడా చూడండిసవరించు
విక్షనరీ, స్వేచ్చా నిఘంటువు లో జీవిచూడండి. |