జీవపరిణామం

(జీవ పరిణామం నుండి దారిమార్పు చెందింది)

మొట్టమొదట భూమి మీద జీవం ప్రారంభమైన నాటి నుండి జీవులు క్రమంగా పొందిన మార్పుల ప్రక్రియే జీవపరిణామం. జీవం నీటిలో రెండు బిలియన్ల సంవత్సరాల పూర్వమే మొదలైంది. మొదట సరళ జీవులుండేవి. సరళ జీవుల నుండి పెద్దవైన సంశ్లిష్టమైన జీవులు క్రమేపి పరిణామం చెందాయి. ఈ మార్పులు చాలా నెమ్మదిగా జరిగాయి. చాలా రకాల జీవరాశులు గతంలో నివసించాయి. వాటిలో చాలా భాగం ఇప్పుడు జీవించడంలేదు. అవి అంతరించి పోయాయి. వాటి స్థానంలోనే బాగా పరిణామం చెందిన జీవులు వచ్చాయి.ప్రకృతి వరణమును అనుసరించి జీవం ఉన్నత జీవరాశులుగా పరిణామం చెంది ఉండవచ్చని ఛార్లెస్ డార్విన్ మహాశయుడు ప్రతిపాదించాడు. అస్థిత్వ పోరాటంలో మనుగడకు అనుకూల లక్షణాలు కల జీవులు ఇతర జీవుల కన్నా దీర్ఘకాలం జీవించి ఎక్కువ సంతానాన్ని పొందాయి. ఈ విధంగా లాభదాయకమైన అనుకూల లక్షణాలు దీర్ఘకాల వారసులకు సంక్రమించాయి.
మానవుడు జీవపరిణామంలోని అత్యున్నత స్థాయిలో ఉన్నాడు. మానవులు సుమారు రెండు మిలియన్ల సంవత్సరాలుగా ఈ భూమి మీద నివసిస్తున్నాడు. ఈ కాలం భూమి మీద జీవం యేర్పడినప్పటి నుండి ఉన్న కాలంలో ఇది వెయ్యో వంతు కంటే కూడా తక్కువే. అత్యున్నత పరిణామం చెంది మానవులు ప్రాణులన్నిటి కంటే ఉత్తమమైన ప్రజ్ఞను కల్గి ఉన్నారు. ప్రాచీన యుగపు జీవరాశుల సాక్ష్యాధారాలను జాగ్రత్తగా అధ్యయనం చేసి శాస్త్రవేత్తలు జీవుల గత చరిత్రను అవగాహన చేసుకుంటున్నారు.

ఈ వ్యాసాన్ని లేదా వ్యాస విభాగాన్ని డార్విన్ జీవపరిణామ సిద్ధాంతం వ్యాసంలో విలీనం చెయ్యాలని ప్రతిపాదించడమైనది. (చర్చించండి)
స్త్రీ మానవ జీవ పరిణామ క్రమం

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు

వెలుపలి లంకెలు

మార్చు