జున్ను
జున్ను పాల నుంచి తయారయ్యే ఒక పదార్థం. గేదె లేదా ఆవు దూడను కన్న కొన్ని రోజుల పాటు ఇవి ఇచ్చే పాలు ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. దూడను కన్నప్పుడు ఇచ్చే మొదటి పాలకి మరుసటి రోజు ఇచ్చే పాలకి ఆ తరువాత రోజు ఇచ్చే పాలకి తేడాలుంటాయి. ఆవు దూడను ఈనిన మొదటి రోజు ఇచ్చిన పాలను కాగబెట్టినపుడు పాలు గట్టి గడ్డ గాను తరువాత ఇచ్చే పాలు తేలిక గడ్డ గాను మార్పు చెందుతూ మామూలు పాల రూపానికి మారడానికి కొన్ని రోజుల సమయం పడుతుంది. ఈ విధంగా పాలు కాగబెడుతున్నప్పుడు గడ్డ కట్టే లక్షణాలున్న ఈ పాలను జున్నుపాలు అంటారు. జున్ను రుచిగా ఉండేందుకు పాలు కాగుతున్నప్పుడు పాలలో చెక్కెర లేక బెల్లం కలుపుకుంటారు. రుచిగా ఉండే ఈ జున్నును చిన్న పెద్ద అని తేడాలేకుండా అందరు ఎంతో ఇష్టంగా తింటారు.
కృత్రిమ జున్ను
మార్చుచిత్రమాలిక
మార్చు-
Cheese, Tacuinum sanitatis Casanatensis (XIV century)
-
A platter with cheese and garnishes
ఇవి కూడా చూడండి
మార్చుబయటి లింకులు
మార్చు- సాదా పాలతో జున్ను
- పాలకొల్లు జున్ను www.palakollujunnu.com