జూపల్లి రామేశ్వరరావు

భారతీయ వ్యాపారవేత్త

డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు మై హోం గ్రూపు వ్యాపార సంస్థల ఛైర్మన్. మహబూబ్ నగర్ జిల్లా కుడికిళ్ళ గ్రామంలో సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఈయన హోమియోపతి విద్యనభ్యసించాడు. 1979లో దిల్‌షుక్‌నగర్‌లో హోమియోడాక్టర్‌గా ప్రాక్టీసు ప్రారంభించారు. తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో ప్రవేశించి మై హోం అనే వ్యాపార సంస్థ ప్రారంభించాడు. తర్వాత మహా సిమెంట్స్ అనే సిమెంటు పరిశ్రమను స్థాపించాడు.[1] శంషాబాద్ దగ్గర ఒక హోమియో ఆసుపత్రి నిర్మించాడు. ఇందులో 14 మంది డాక్టర్లు ఉన్నారు. ఇందులో వైద్యం ఉచితం. జీయర్ ట్రస్టు ద్వారా సామాజిక, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాడు. ఆయన 15 సెప్టెంబర్ 2021న తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యునిగా నియమితుడయ్యాడు.[2][3]

జూపల్లి రామేశ్వర రావు
జననం
కుడికిళ్ళ గ్రామం, కొల్లాపూర్ మండలం, మహబూబ్ నగర్ జిల్లా
విద్యబి. హెచ్. ఎం. ఎస్ (హోమియోపతి)
విద్యాసంస్థపొట్టి శ్రీరాములు వైద్య కళాశాల
వృత్తిహోమియో వైద్యుడు, వ్యాపారవేత్త
తల్లిదండ్రులు
  • వెంకటయ్య (తండ్రి)
దస్త్రం:Joopalli RameswaraRao.jpg

బాల్యం, విద్యాభ్యాసం మార్చు

రామేశ్వర రావు మహబూబ్ నగర్ జిల్లా, కొల్లాపూర్ మండలం, కుడికిళ్ళ గ్రామంలో ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తండ్రి వెంకటయ్య రామేశ్వరరావు ఏడేళ్ల వయసులో ఉండగా మరణించాడు. ఏడవ తరగతి దాకా స్వంత ఊర్లోనే చదివాడు. ఎనిమిదో తరగతికి పక్కనే ఉన్న పట్టణానికి వెళ్ళవలసి వచ్చింది. ఇంటర్ పూర్తి చేసి జిల్లా కేంద్రమైన మహబూబ్ నగర్ లో బి. ఎస్. సి లో చేరాడు. రామేశ్వరరావు అన్న దీని తర్వాత బి. ఎడ్ చేసి ఉపాధ్యాయుడిగా చేరమని కోరాడు. కానీ ఈయనకు వైద్యవృత్తి మీద ఆసక్తి కలిగింది. అన్నకు నచ్చజెప్పి హైదరాబాదులోని పొట్టి శ్రీరాములు మెడికల్ కళాశాలలో హోమియోపతీలో చేరాడు. నాలుగన్నర సంవత్సరాల కోర్సు తర్వాత ఆరు నెలలు పాటు హౌస్ సర్జన్ గా పని చేశాడు.[4]

వృత్తి మార్చు

1979 లో హైదరాబాదులోని దిల్ సుఖ్ నగర్ లో ప్రాక్టీసు ప్రారంభించాడు. అప్పుడే కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులతో పరిచయం అయ్యింది. మొదట హయత్ నగర్ లో ఫ్లాట్లు వేసి కొంత లాభానికి అమ్మారు. తర్వాత ప్రాక్టీసు మానివేసి నిర్మాణరంగంలోకి ప్రవేశించాడు.[5]

1996లో మహా సిమెంట్స్ సంస్థను స్థాపించాడు. శంషాబాద్ లో ఒక హోమియో ఆసుపత్రి నిర్మించి ఉచిత వైద్యం అందిస్తున్నాడు. ఇక్కడ పరిశోధనలు కూడా జరుగుతాయి.

మూలాలు మార్చు

  1. "ఆంధ్రజ్యోతి 27.10.2013". Archived from the original on 2013-10-28. Retrieved 2013-11-16.
  2. TV9 Telugu (15 September 2021). "25 మందితో టీటీడీ పాలక మండలి.. తుది జాబితా ఖరారు చేసిన ఏపీ సర్కార్". Archived from the original on 4 జనవరి 2022. Retrieved 4 January 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. 10TV (16 September 2021). "తిరుమల నూతన పాలకమండలి.. సభ్యుల జాబితా ఇదే | List of members of the new governing body of Tirumala" (in telugu). Archived from the original on 16 సెప్టెంబరు 2021. Retrieved 4 January 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  4. "ఆయన కోసం ఆరు నెలలు తిరిగా". ఈనాడు. 17 March 2019. Archived from the original on 17 March 2019.
  5. Andhrajyothy (7 February 2021). "రాజకీయాల్లోకి రమ్మని చంద్రబాబు ఆహ్వానించినా వద్దనుకున్నాను". Archived from the original on 11 జనవరి 2022. Retrieved 11 January 2022.