జెన్ అనేది 6 వ శతాబ్దంలో చైనాలో చాన్‌గా అభివృద్ధి చెందిన మహాయాన బౌద్ధమత విభాగం. చైనా నుండి, జెన్ దక్షిణాన వియత్నాం, తూర్పున జపాన్, ఈశాన్యాన కొరియాలకు వ్యాపించింది. [1]

జెన్ వనం(గార్డెన్)

జెన్ మధ్య చైనా ప్రాంత పదం 禪 (dʑjen) (పిన్యిన్: చాన్) యొక్క జపనీస్ ఉచ్చారణ నుండి ఉద్భవించింది. ఆ పదం మొట్టమొదట సంస్కృత పదం ధ్యానం నుండి సంగ్రహించినది.[2] జెన్ ముఖ్యంగా బుద్దుడి స్వభావంలోకి అంతర్దృష్టి, రోజువారీ జీవితంలో దాని గురించిన వ్యక్తిగత వ్యక్తీకరణలపై, ఇతరుల లాభం కోసం పనులు చేయడంపైనా లోతుగా దృష్టి పెడుతుంది.[3][4] అందువల్ల కేవలం సూత్రాలు, సిద్ధాంతాలు తెలుసుకోవడం నిరర్థకమని చెప్తుంది.[5][6] జెజెన్ అనే ప్రాథమిక మతపరమైన ధ్యానాన్ని అవలంబించడం ద్వారా అవగాహన చేసుకోవడం, సిద్ధుడైన గురువు సాన్నిహిత్యం వంటివి ప్రధానమని తెలుపుతుంది.[7]

జెన్ బోధనలు వివిధ మహాయాన బౌద్ధసిద్ధాంత భావనలు కలిగివుంటుంది. ప్రధానంగా యోగాచార, తథాగత గర్భసూత్రాలు, హుయాన్‌లలోని బుద్ధుని స్వభావం, సంపూర్ణత, బోధిసత్వ ఆదర్శం వంటివాటిపై దీనిలోని మూలసూత్రాలు ప్రభావితమయ్యాయి.[8][9] ప్రజ్ఞాపరమిత సాహిత్యం, కొద్దిభాగం మాధ్యమిక వాదం కూడా ప్రభావితం చేశాయి.[10]

చరిత్ర

మార్చు

చైనాకు బౌద్ధం వ్యాపించాకా క్రమాంతరాలపై బుద్ధభద్రుడు అనే భిక్షువు సముద్రమార్గంలో చైనా దక్షిణ భాగంలో మత ప్రచారం ప్రారంభించాడు. చైనీయుల ఊహాశక్తి, కావ్యధోరణికి భారతీయుల మనస్సంసయం, ద్యానం జోడించి ఆ బౌద్ధభిక్షువు చైనాలో ధ్యానవాదానికి పునాదులు ఏర్పాటుచేశాడు. ఇదే క్రమంగా బౌద్ధమతంగా తయారయింది.[11]

మూలాలు

మార్చు
 1. Harvey 1995, p. 159–169.
 2. Kasulis 2003, p. 24.
 3. Yoshizawa 2010, p. 41.
 4. Sekida 1989.
 5. Poceski & Year unknown.
 6. Borup 2008, p. 8.
 7. Yampolski & 2003-A, p. 3.
 8. Dumoulin & 2005-A, p. 48.
 9. Lievens 1981, p. 52–53.
 10. Dumoulin & 2005-A, p. 41–45.
 11. రామారావు, మారేమండ (1947). భారతీయ నాగరికతా విస్తరణము (1 ed.). సికిందరాబాద్, వరంగల్: వెంకట్రామా అండ్ కో.
"https://te.wikipedia.org/w/index.php?title=జెన్&oldid=3878299" నుండి వెలికితీశారు