జెమిని శంకరన్
మూర్క్కోత్ వెంగక్కండి శంకరన్ (1924 జూన్ 13 - 2023 ఏప్రిల్ 23) భారతీయ సర్కస్ యజమాని, వ్యాపారవేత్త. జెమినీ శంకరన్‌గా ప్రసిద్ధి చెందిన ఆయన జెమిని సర్కస్ సంస్థ వ్యవస్థాపకుడు, భారత సర్కస్ దిగ్గజం.
జెమిని శంకరన్ | |
---|---|
జననం | మూర్క్కోత్ వెంగక్కండి శంకరన్ 1924 జూన్ 13 కొలస్సేరి, మలబార్ జిల్లా, మద్రాస్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా (ఇప్పుడు కన్నూరు జిల్లా, కేరళ, భారతదేశం) |
మరణం | 2023 ఏప్రిల్ 23 కన్నూర్, కేరళ | (వయసు 98)
మరణ కారణం | వృద్ధాప్య సమస్యలు |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | జెమిని సర్కస్ సంస్థ వ్యవస్థాపకుడు |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | భారతదేశంలో అగ్రగామి సర్కస్ పరిశ్రమను నెలకొల్పిన దిగ్గజం |
జీవిత భాగస్వామి | శోభన |
పిల్లలు | 3 |
తల్లిదండ్రులు |
|
పురస్కారాలు | భారత ప్రభుత్వ జీవితకాల సాఫల్య పురస్కారం |
దేశంలో సర్కస్ పరిశ్రమ మార్గదర్శకులలో ఒకడిగా[1] గుర్తించిన భారత ప్రభుత్వం ఆయనను లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ పురస్కారంతో సత్కరించింది.[2]
గుర్తింపు
మార్చు- 2012లో జెమిని శంకరన్ ఆత్మకథ మలక్కం మరియున్న జీవితం(Malakkam Mariyunna Jeevitham) వచ్చింది.
- అతని జీవిత చరిత్ర మరో పుస్తకంగా జెమినీ శంకరన్ అండ్ ది లెగసీ ఆఫ్ ఇండియన్ సర్కస్(Gemini Shankaran and the Legacy of Indian Circus) అని కూడా వచ్చింది.[2]
- 1964లో రష్యా అంతర్జాతీయ సర్కస్ ఫెస్టివల్‌లో శంకరన్ సారథ్యంలోని భారత్ బృందం పాల్గొంది.
- సర్కస్‌కు చేసిన సేవలకు గాను శంకరన్‌ను కేంద్ర ప్రభుత్వం జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించింది.
మరణం
మార్చు99 ఏళ్ల జెమినీ శంకరన్ వృద్ధాప్య సమస్యలతో కొన్నిరోజులుగా కన్నూర్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2023 ఏప్రిల్ 23న కన్నుమూసాడు.[3] ఆయనకు భార్య శోభన, ఇద్దరు కుమారులు అజయ్ శంకర్, అశోక్ శంకర్, రేణు శంకర్ అనే కుమార్తె ఉన్నారు.[4]
మూలాలు
మార్చు- ↑ "Circus legend Gemini Sankaran gets Covid-19 Vaccine in". world360news.com. Archived from the original on 24 ఏప్రిల్ 2023. Retrieved 24 April 2023.
- ↑ 2.0 2.1 Shrihari Nair (2013). "Gemini Shankaran and the legacy of Indian circus". Gayathri designs. Retrieved 24 April 2023.
- ↑ "జెమిని సర్కస్ వ్యవస్థాపకుడు శంకరన్ కన్నుమూత |". web.archive.org. 2023-04-26. Archived from the original on 2023-04-26. Retrieved 2023-04-26.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Gemini Shankaran, pioneer of Indian circus, passes away". English.Mathrubhumi (in ఇంగ్లీష్). 24 April 2023. Retrieved 24 April 2023.