జైనుల జాబితా
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
జైన మతాన్ని పార్శ్వనాధుడనే వాడు స్థాపించాడు. పార్శ్వనాధుడు 22 వ తీర్థంకరునిగా గుర్తు పెట్టుకొన్నారు. కనుక జైన మతం వర్థమాన మహావీరుని కంటే ముందే వుంటుందంటారు. అంతే కాదు, ఇది వేదమతం కాలం నుంచే వుందంటారు. ఎలాగంటె ఈ మతానికి 24 మంది తీర్థంకరులున్నారని, చివరివాడు వర్థమానుడని, మొదటి వాడు ఋషభదేవుడు,అరిష్టనేములని అంటారు. ఋషభదేవుడు మొదటి తీర్థంకరుడు. అతని గురించి ఋగ్వేదంలో పేర్కొనబడింది. అంతే కాదు యితడు విష్ణుపురాణం లో, భాగవత పురాణంలో నారాయణావతారంగా కీర్తించబడ్డాడు. దీనిని బట్టి జైన మతం ఋగ్వేద మతం అంత పాతది. ఈ 24 తీర్థంకరుల లేదా ప్రవక్తల ప్రవచనమే జైనం. ఆ 24 ప్రవక్తలు వీరు;
జైనుల ప్రవక్తల జాబితా
మార్చు1. ఋషభ దేవుడు
2. అజితుడు
3. సంభవుడు
4. అభినందనుడు
5. సుమతి
6. పద్మ ప్రభు
7. సుపార్శ్వ
8. చంద్ర ప్రభు
9. పుష్పదంత లేక సువిధి
10. షింతల
11. ష్రేయన్య
12. వాసువ్
13. విభాత
14. అనంత
15. ధర్మ
16. షాంతి
17. కుంతు
18. అర
19. మల్లినాథ
20. మునిస్రవత
21. నమి
22. నేమి
23. పార్శ్వనాధ
24. మహావీర
విశ్వం పుట్టి ఎన్నో వలయాల కాలం గడిచింది. ప్రతి వలయంలోనూ 24 మంది తీర్థంకరులు , పండ్రెండు మంది విశ్వ చక్రవర్తులు. మొత్తం మీద 63 మంది గొప్ప వ్యక్తులుంటారు.