జైమిని భారతం

జైమిని భారతం వ్యాసుని శిష్యుడైన జైమిని మహర్షి చేత రచించబడింది.

పక్షులతో జైమిని

నేపథ్యంసవరించు

మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం ముగిసినతరవాత, బంధుమిత్రులూ, గురువులూ, దాయాదులతో సహా అశేష జనానీకం ఆయుద్ధంలో మరణించినందున ధర్మరాజు వ్యథ చెందుతూంటే, వ్యాసమహర్షి అశ్వమేధయాగం చేయమని సూచించడంతో ప్రారంభమవుతుంది. ఆ కథను తన శిష్యుడయిన జైమిని మహర్షిని వ్రాయమని ఆదేశించాడు. ఇదీ సూక్ష్మంగా జైమినీభారతానికి నాంది.[1]

పుస్తకంలో అంశాలుసవరించు

ఇందులో కురుక్షేత్ర యుద్ధం తరువాత ధర్మరాజు చేసిన అశ్వమేధ యాగం గురించి అశ్వం దేశం నలుమూల తిరుగునప్పుడు అర్జునుడు, శ్రీకృష్ణుడు ఏవిధంగా అశ్వాన్ని రక్షించి అశ్వమేధ యాగం సమాప్తి చేయించిన విశేషాలు పొందుపరచబడ్డాయి.

ఈ పుస్తకాన్ని వేంకట కృష్ణప్పకవి తెలుగులో అనువదించాడు. ఇది ఐదు అధ్యాయముల వచనకావ్యం. ఇది రచించిన కాలము 18వ శతాబ్దం ప్రథమార్థం కావచ్చును. ఈ గ్రంథానికి జయంతి రామయ్య ఇంగ్లీషులోనూ, మల్లాది సూర్యనారాయణ శాస్త్రి తెలుగులోనూ విపుల పీఠికలు రాసేరు.

మూలాలుసవరించు

  1. మాలతి, రచయిత (2017-11-05). "జైమినీభారతం – చిన్న పరిచయం". తెలుగు తూలిక. Retrieved 2021-05-02.

వనరులుసవరించు