జై బోలో తెలంగాణ గళగర్జనల జడివాన (పాట)

(జై బోలో తెలంగాణ గళగర్జనల జడివాన నుండి దారిమార్పు చెందింది)

జై బోలో తెలంగాణ గళగర్జనల జడివాన పాట 2011లో విడుదలైన జై బోలో తెలంగాణా చిత్రంలోని పాట. ఈ పాట రాసినందుకు అందెశ్రీ కి రాష్ట్రస్థాయిలో ఉత్తమ గీత రచయితగా నంది బహుమతి వచ్చింది. చక్రి సంగీతం అందించిన ఈ పాటను వందేమాతరం శ్రీనివాస్ పాడాడు.[1][2]

"జై బోలో తెలంగాణ గళగర్జనల జడివాన"
జై బోలో తెలంగాణ గళగర్జనల జడివాన పాటలోని దృశ్యం
రచయితఅందెశ్రీ
సంగీతంచక్రి
సాహిత్యంఅందెశ్రీ
ప్రచురణజై బోలో తెలంగాణా (2011)
రచింపబడిన ప్రాంతంఆంధ్రప్రదేశ్
భాషతెలుగు
గాయకుడు/గాయనివందేమాతరం శ్రీనివాస్
చిత్రంలో ప్రదర్శించినవారుజగపతిబాబు

పాటలోని సాహిత్యం మార్చు

పల్లవి:
జన జాతరలో మన గీతం
జయకేతనమై ఎగరాలి
జంఝా మారుత జన నినాదమై
జే గంటలు మోగించాలి
ఒకటే జననం ఓహో…!
ఒకటే మరణం ఆహా…!
జీవితమంతా ఓహో…!
జనమే మననం ఆహా…!
కష్టాల్ నష్టాలెన్నెదురైనా
కార్యదీక్షలో తెలంగాణ
జై బోలో తెలంగాణ
గళగర్జనల జడివాన
జై బోలో తెలంగాణ
నిలువెల్ల గాయాల వీణా ||జనజాతరలో||

చరణం 1:
దేశముఖులను దొరభూస్వాముల
గడీల నుండి ఉరికించాం
రజాకారులను తరిమికొట్టి
నైజాముకే గోరి గట్టేశాం
రోషం గుండెల ఓహో…!
రోకలి బండలు ఆహా …!
బిగిసిన పిడికిళ్ళు ఓహో…!
వడిశెల రాళ్ళు ఆహా…!
వేలకువేలా బలిదానాల
వీరులు చేప్పిన దారుల్లో
జై బోలో తెలంగాణ
గళగర్జనల జడివాన
జై! బోలో తెలంగాణ
నిలువెల్ల గాయాల వీణా ||జనజాతరలో||

పురస్కారాలు మార్చు

  1. అందెశ్రీ- ఉత్తమ గీత రచయితగా నంది పురస్కారాలు -2011

మూలాలు మార్చు

  1. "Jai Bolo Telangana Songs Download". Naa Songs (in అమెరికన్ ఇంగ్లీష్). 2014-03-20. Retrieved 2020-12-22.
  2. admin. "Jai Bolo Telangana (2011) Telugu Songs Download | Naa Songs". Archived from the original on 2022-08-10. Retrieved 2020-12-22.