జొన్న

తృణ ధాన్యము
(జొన్నలు నుండి దారిమార్పు చెందింది)

అందరూ ఇష్టపడే చిరుధాన్యం జొన్న (ఆంగ్లం: Sorghum). శరీర నిర్మాణానికి తోడ్పడే ప్రొటీన్లు, శక్తినిచ్చే పదార్థాలతో పాటు రక్తవృద్ధికి తోడ్పడే ఇనుము, కాల్షియం, బి-విటమిన్లు, ఫోలిక్‌ ఆమ్లం వంటి సూక్ష్మపోషకాలు జొన్నలో పుష్కలంగా లభిస్తాయి. అందుకే రొట్టెలతో పాటు, జొన్నతో చేసిన పేలాల లడ్డు, అప్పడాలు, అంబలి వంటివి రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.30 దేశాలలో 500 మిలియన్ల ప్రజలు జొన్నలను ప్రథాన ఆహార ధాన్య౦గా తీసుకొని జీవిస్తున్నారు. సి౦ధునాగరికతకు సమా౦తర౦గా కృష్ణా గోదావరీ పరీవాహక ప్రా౦తాలలో జొన్నల్నీ బాగానే ప౦డి౦చారు.ఇతర ధాన్యాల కన్నా ఇనుము, జి౦కు ఎక్కువగా ఉ౦టాయి కాబట్టి, జొన్నలు కేలరీలను పెరగనీకు౦డా శక్తినిస్తాయి. గోధుమలలో ఉ౦డే, గ్లూటెన్ అనే మృదువైన ప్రొటీన్ చాలామ౦దికి సరిపడట౦ లేదు. జొన్నల్లో గ్లూటెన్ ఉ౦డదు.అ౦దువలన ఈ ప్రత్యామ్నాయ ధాన్య౦ మీదకు ప్రప౦చ౦ తనదృష్టి సారి౦చి౦ది. ఒకవైపున జొన్నలకు ప్రప౦చ వ్యాప్త౦గా ఈ విధ౦గా డిమా౦డ్ పెరుగుతు౦టే, మనవాళ్ళు ప౦డి౦చట౦ తగ్గి౦చేస్తున్నారు. భారత దేశ౦లో గడచిన రె౦డు దశాబ్దాలకాల౦లో12 మెట్రిక్ టన్నులను౦చి 7 మెట్రిక్ టన్నులకు జొన్న ఉత్పత్తి పడిపోయి౦దని ఇక్రిశాట్ నివేదిక చెప్తో౦ది. జొన్నలు ఇప్పుడు బియ్య౦కన్నా ఎక్కువ రేటు ఉన్నాయి. ధర పెరగటానికి ప౦ట తగ్గిపోవట౦, డిమా౦డ్ పెరగటాలు కారణాలు. ర౦గు రుచి వాసనా లేకు౦డా తటస్థ౦గా ఉ౦టు౦ది కాబట్టి, జొన్నపి౦డి ఏ ఇతర వ౦టక౦లో నయినా కలుపు కోవటానికి వీలుపడుతుంది.

జొన్న
Sorghum.jpg
Scientific classification
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
సోర్ఘమ్

జాతులు

About 30 species, see text

పోషక పదార్థాలుసవరించు

 
తెల్లజొన్నలు

ఉపయోగాలుసవరించు

జొన్న ఆహారంసవరించు

 
జొన్నచేను
 1. ఇవి తేలిగ్గా జీర్ణమవుతాయి
 2. జబ్బుపడినవారు త్వరగా కోలుకోవడానికి జొన్నలతో చేసిన పదార్థాలను పెట్టడం ఎంతో మంచిది.
 3. అన్ని రకాల జొన్నలూ బాలింతలకు మంచి బలవర్థకమైన ఆహారంగా పనిచేస్తాయి.
 4. తగినంత పీచు ఉండడం వల్ల జీర్ణసమస్యలు రాకుండా ఉంటాయి.
 5. విలువలు కూడా జొన్నలోనే ఎక్కువ. వీటివల్ల 349 కిలోకేలరీల శక్తి లభిస్తుంది.

ఇతర ఉపయోగాలుసవరించు

 1. జొన్న విత్తనాలు: వాణిజ్యపరమైన మద్యం (ఆల్కహాల్) సంబంధ పానీయాలు తయారుచేయడానికి ఉపయోగిస్తారు. కోళ్ళకు దాణాగా వాడతారు. జొన్నలతో చేసే రొట్టెలు ఆహారంగా ఉపయోగపడుతుంది.
 2. జొన్న ఆకులు, కాండాలు పశుగ్రాసంగా ఉపయోగిస్తారు. కాగితం తయారీలో వాడతారు.
 3. జొన్నపంట పండిన పిదప జొన్నలను వేరుచేసి మిగిలిన కాండము (సొప్ప) పశువులకు ఆహారంగా వేస్తారు.

జొన్న రొట్టెలు తయారీసవరించు

 • జొన్నలను గిర్నికి (పండి మర) తిసుకొని పోయి పిండి చేయాలి.
 • పిండిని వేడి నీళ్ళతో కలిపి ముద్ద చేయాలి.
 • ముద్దతో చపాతీల మాదిరిగా చేతితో చరుస్తూపలుచగా చేసి పెనం పై రొట్టె చేయాలి.
"https://te.wikipedia.org/w/index.php?title=జొన్న&oldid=2719684" నుండి వెలికితీశారు